రామప్ప శిల్పాలపై టూరిస్టుగైడ్స్ అసత్య వివరణ
x

రామప్ప శిల్పాలపై టూరిస్టుగైడ్స్ అసత్య వివరణ

తెలంగాణ చరిత్రకారుల అభ్యంతరం


రానిన్న 2022 మిస్ ఇండియా విజేత నందినిగుప్తా, ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్పదేవాలయాన్ని సందర్శించారు. సందర్భంగా స్థానిక టూరిస్టు గైడ్లు ఆలయం గురించి ఆందించిన సమాచారం వాస్తవదూరంగా ఉంది. రాళ్ళను కరిగించి పోతపోసి రామప్పశిల్పాలను మలిచారని వివరించడం జరిగింది. దీనికి రాష్ట్రానికి చెందిన చరిత్రకళాకారులు అభ్యంతరం చెబుతున్నారు. కొత్త తెలంగాణచరిత్రబృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్, కోకన్వీనర్లు బీవీభద్రగిరీశ్, కట్టా శ్రీనివాస్, బృంద సభ్యులు, అనుబంధసభ్యులు ఈ గైడ్స్ అందించిన వివరణను ఖండించారు.

రామప్ప గుడిలో 2022 మిస్ ఇండియా విజేత నందినీ గుప్తా ( X ఫోటో)


రామప్ప శిల్పాలు ఉలితో చెక్కి, మలిచినదే కాని, రాళ్ళను కరిగించిపోతపోసినవి కావని వారు ఒక ప్రకటనలో పేర్కొన్నార. ‘అభూతకల్పనలు తెలంగాణ శిల్పుల కీర్తిని మసకబారుస్తాయి. రామప్ప టూరుగైడ్లు వాస్తవబద్ధమైన శిల్పకళావైభవవాన్ని మాత్రమే వివరించాలి" అని అన్నారు. ఈ చరిత్రబృందం అభిప్రాయంతో డా.ఈమని శివనాగిరెడ్డిగారు, స్థపతి డిఎన్వీ ప్రసాద్ గారు ఏకీభవించారు.

"రాళ్ళను కరిగించి శిల్పాలు చెక్కే టెక్నాలజీ అప్పుడే కాదు ఇప్పుడు కూడా లేదు. రాళ్ళు మాగ్మా నుంచి కొన్ని ప్రత్యేక బౌమ పరిస్థితుల్లో ఏర్పడుతాయి. ఆ పరిస్థితులను కృత్రిమంగా స్రృష్టించలేము. ఒకసారి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన శిలను ఎక్కువ ఉష్ణోగ్రతకు గురిచేస్తే అది ముక్కలు కావటం తప్ప ఏమీ జరగదు," అని ప్రముఖ జియోలజిస్టు, చిత్రబృందం సలహాదారులు చకిలం వేణుగోపాల్ రావుగారు తమ అభిప్రాయాన్ని చెప్పారు

Read More
Next Story