
‘ఇందూరు సమగ్ర చరిత్ర రాసుకుందాం...’
రచనల కోసం చరిత్రకారులకు, పరిశోధకులకు, చరిత్ర ప్రేమికులకు ఒక విజ్ఞప్తి
ఇందూరు (నిజామాబాద్) జిల్లా చరిత్రకు సంబంధించిన 'సమగ్ర చరిత్ర, సంస్కృతి' అందించాలనుకుంటున్నాం. ఆది నుండి ఆధునిక కాలం వరకు ఇందూరు (నిజామాబాద్) ప్రాంతీయ చరిత్ర, సంస్కృతిని సమగ్రంగా, సవివరంగా మీకు అందించాలనే ఒక మహత్తర ఆశయంతో ఈ చరిత్ర రచన యోజన తలపెట్టడం జరిగింది. దానిని విజయవంతం చేయడానికి మీ అందరి సహకారం అవసరం.
ఇందూరు (నిజామాబాద్) జిల్లాకు సంబంధిన సమగ్ర సమాచారాన్ని సంకలనం చేయడానికి మీవంతు కృషి చేయాలని చరిత్ర ప్రేమికులకు విన్నపం . చరిత్ర వివరాల్ని, ఏ రంగానికి చెందినదైనా, మాకు అక్షర రూపంలో పంపాల్సిందిగా ప్రధాన సంపాదకుడు నరేష్ కుమార్ కలువకోట విజ్ఞప్తి చేస్తున్నారు.
చారిత్రిక విషయం పరిజ్ఞానం కలిగిన వారెవరైనా సరే, జిల్లా చరిత్ర వివరాల్ని పంపవచ్చును. చరిత్ర, కళలు, సాహిత్యం, పాలనా విధానం, గొప్ప వారి చరిత్ర మున్నగు విషయాలపై రచనలు చేయవచ్చును. ఆ రచన మీ స్వీయ రచన అనే ఒక హామీ పత్రాన్ని జత పర్చాలి.
రచనలు పంపాల్సిన చివరి తేదీ సెప్టెంబర్ 20, 2025.
హార్డ్ కాపీతో పాటు సాఫ్ట్ కాపీ పంపితే మాకు సౌకర్యంగా ఉంటుంది. సాధ్యమైనంత తొందరగా ఈ గ్రంధాన్ని మీ చేతుల్లో ఉంచాలనేది మా కోరిక.
మీ రచనలను ఎంపిక చేయడానికి ఒక నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంపిక తుది నిర్ణయం ఈ కమిటీ సభ్యులదే.
Expert Committee:
1. Prof V.Kishan Rao, Former Registrar, Osmania University, Hyd.
2. M.Veerender, Former Dy. Curator, Salarjung Museum, Hyd,
3. Dr. S.Jaikishan, Chairman, Bhawans Science College, Hyd
4. Prof. Ch. Anjaneyulu, Dept of Communications, Telangana University, Nzb
5. Kandakurti Yadava Rao, Historian, Nzb
6. Dr. D.Surya Kumar, ఎపిగ్రాఫిస్ట్
మరిన్ని వివరాలకు మొబైల్ నెంబర్
8008222645 లేదా ఇ-మెయిల్ ithihasa1induru@gmail.com ద్వారా నిర్వహాకులను సంప్రదించవచ్చు.
Next Story