చర్లపల్లి జైల్లో ఊచలు లెక్కిస్తున్న ఆ అవినీతి అధికారి!
x
sivabala krishna

చర్లపల్లి జైల్లో ఊచలు లెక్కిస్తున్న ఆ అవినీతి అధికారి!

7 జిల్లాలు, 107 ఎకరాలు, వందల కోట్ల ఆస్తులు.. అక్రమాలకు మారు పేరుగా ఆరోపణలు ఎదుర్కొన్న హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను చర్లపల్లి జైల్లో పెట్టారు


7 జిల్లాలు, 107 ఎకరాలు, వందల కోట్ల ఆస్తులు.. అక్రమాలకు మారు పేరుగా ఆరోపణలు ఎదుర్కొన్న హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ చర్లపల్లి జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు. అవినీతి ఆరోపణలపై శివ బాలకృష్ణ ఇంటిపై దాడులు చేసి సుమారు 4 వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని సంపాయించినట్టు గుర్తించి అరెస్ట్ చేసిన ఆ అధికారిని ఏసీబీ కోర్టులో హాజరు పర్చారు. ఆయనకు కోర్టు 14రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. ఫిబ్రవరి 8వరకు రిమాండ్ ఉండనుంది. పోలీసులు ఆయన్ను చంచల్ గూడా జైలుకు తరలించారు.

ఏయే సెక్షన్ల కింద కేసులు పెట్టారంటే...

బాలకృష్ణ ఇంటితో పాటు 17 ప్రదేశాల్లో సోదాలు చేశారు ఏసీబీ అధికారులు. నిందితుడు బాలకృష్ణపై 13 (1) (b), 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాలకృష్ణ ఇంటితో పాటు, బందువులు, సహచరుల ఇళ్లల్లో సోదాలు చేశారు. బాలకృష్ణ ఇంట్లో రూ.99.60 లక్షలు నగదు సీజ్ చేశారు. 1988 గ్రాముల బంగారాన్నిస్వాధీనం చేసుకున్నారు. 6 కేజీల వెండి, రూ.81.26 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల పత్రాలు కూడా శివబాలకృష్ణ ఇంట్లో దొరికాయి. బీనామీలపై విచారణ జరుగుతోంది.

బయటికి వస్తున్న బాధితులు...

ఏసీబీ అరెస్టుతో హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. పుప్పాలగూడ సర్వేనెంబర్ 447లో కోర్టు పరిధిలోని వివాదస్పద భూములకు అనుమతులు ఇచ్చారని సూర్యప్రకాష్ అనే బాధితుడు తెలిపాడు. తమకు కోర్టు డిక్రీ ఉన్నప్పటికీ హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టి పర్మిషన్ ఇచ్చాడని ఆరోపించారు. రఘురామ్ ప్రదీప్ కన్స్ట్రక్షన్ కు హైరేస్ అపార్ట్ మెంట్స్ కు అనుమతులు ఇచ్చాడని పేర్కొన్నారు. అక్రమ అనుమతులపై హైకోర్టకు వెళ్తే కోర్టును తప్పుదోవ పట్టించి ఫేక్ అఫిడవిట్ వేశారని తెలిపారు. ఆర్టీఏ ద్వారా సమాచారం అడిగితే ఇప్పటివరకు ఎలాంటి సమాదానం ఇళ్వకుండా దాటవేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రూ.400కోట్ల విలువైన 6.36 ఎకరాల భూమిలో అక్రమ పర్మిషన్ ఇచ్చాడని ఇంకో బాధితుడు ఆరోపించారు. ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు ఉన్నారని బెదిరించేవారని బాధితులు వాపోతున్నారు.

శివబాలకృష్ణ లంచాలు ఎలా తీసుకుంటారంటే...

హెచ్ఎండీఏ 7 జిల్లాల పరిధిలో ఉంది. వందలాది రియల్ ఎస్టేట్ సంస్థలు వచ్చాయి. ఏదైనా వివాదాస్పద భూమికో, మరింకేదైనా లే అవుట్ కో అనుమతులు ఇచ్చేందుకు హెచ్ఎండీఏ ప్లానింగ్ అధికారి అయిన శివబాలకృష్ణకు అధికారం ఉంది. ఆయన అక్రమ లేఅవుట్లకు అనుమతి ఇచ్చేవారు. దానికి బదులుగా ఏదైనా భూమిని రాయించుకుంటారు. వివాదాస్పద భూములకు రియల్ ఎస్టేట్ సంస్థలకు అనుమతి ఇచ్చేవారు. వాళ్ల నుంచి కొంత మొత్తంలో నగదు, మిగతాది తన పేరిటో, తన బినామీల పేరిటో స్థలం లేదా పొలం రాయించుకునే వారు. ఇలా క్విడ్ ప్రోకు ఆయన ప్రతిరూపంగా ఉండేవారు. ఇలా మొత్తం 7 జిల్లాలలోనూ ఆయనకు భూములు ఉన్నాయని అధికారులు తేల్చారు.

Read More
Next Story