డాక్టర్ తహవ్వుర్ అంతర్జాతీయ టెర్రరిస్టుగా ఎలా మారాడు ?
x
International Terrorist Tahawwur Rana

డాక్టర్ తహవ్వుర్ అంతర్జాతీయ టెర్రరిస్టుగా ఎలా మారాడు ?

అమెరికా నుండి ప్రత్యేక విమానంలో ఎన్ఐఏ ఉన్నతాధికారులు ఢిల్లీకి తీసుకొచ్చారంటేనే రాణా ఎంతటి మోస్ట్ వాటెండ్ టెర్రరిస్టో(Most wanted Terrorist) అర్ధమైపోతోంది


డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అని సినిమా సెలబ్రిటీలు చేప్పిన మాటలను మనం చాలానే వినుంటాము. దాదాపు అలాంటిదే అంతర్జాతీయ తీవ్రవాది తహవ్వుర్ హుస్సేన్ రాణా(Tahawwur Rana) కథకూడా. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే తహవ్వుర్ ముందు డాక్టర్ అయి తర్వాతే టెర్రరిస్టయ్యాడు. డాక్టర్ గా ఎంత నిబద్ధతతో పనిచేశాడో టెర్రరిస్టుగా కూడా అలాగే పనిచేశాడని సమాచారం. ఈరోజు అమెరికా నుండి ప్రత్యేక విమానంలో ఎన్ఐఏ ఉన్నతాధికారులు ఢిల్లీకి తీసుకొచ్చారంటేనే రాణా ఎంతటి మోస్ట్ వాటెండ్ టెర్రరిస్టో(Most wanted Terrorist) అర్ధమైపోతోంది. అమెరికా(America) నుండి రాణాను ఇండియాకు తీసుకురావటానికి కేంద్రప్రభుత్వానికి సుమారు పదేళ్ళు పట్టిందంటే ఆశ్చర్యంగానే ఉంది.

గురువారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఢిల్లీలో దిగిన రాణాను ఎన్ఐఏ(NIA) అధికారులు ముందుగా తమ హెడ్ క్వార్టర్స్ కు తీసుకెళ్ళారు. అక్కడ విచారించిన తర్వాత తీహార్ జైలుకు తరలిస్తారు. ఇంతకీ రాణాను ఇండియాకు తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది ? ఏమొచ్చిందంటే, 2008లో జరిగిన ముంబాయ్(Mumbai Blasts) పేలుళ్ళలో రాణా పాత్ర చాలా కీలకం. 2008లో జరిగిన పేలుళ్ళల్లో సుమారు 160 మంది చనిపోగా మరికొన్ని వందలమంది తీవ్రంగా గాయపడిన విషయం గుర్తుండే ఉంటుంది. టెర్రరిస్టు ఆర్గనైజేషన్ లష్కర్-ఏ-తొయిబాలో రాణా చాలా కీలకమైన వ్యక్తి. అత్యంత ప్రముఖులపై తోయిబా చేసిన దాడుల్లో, తోయిబా టెర్రరిస్టులు జరిపిన బాంబు పేలుళ్ళల్లో, 2009లో డానిష్ న్యూస్ పేపర్ జాయ్ ల్యాండ్స్-పోస్టెన్ ఉద్యోగుల మీద విఫలమైన దాడిలో కూడా రాణా కీలక వ్యక్తిగా దర్యాప్తుసంస్ధలకు అనేక ఆధారాలు దొరికాయి.

ఇంతకీ డాక్టర్ అయిన తహవ్వుర్ రాణా అసలు టెర్రరిస్టు ఎలాగయ్యాడు ? ఎలాగంటే 1961, జనవరి 12వ తేదీన పుట్టిన రాణా మొదట్లో పాకిస్ధాన్ ఆర్మీలో డాక్టర్ గా పనిచేసేవాడు. రాణా భార్య కూడా ఆర్మీలో డాక్టరే. పాకిస్ధాన్(Pakistan Army) ఆర్మీ అంటేనే తెలుసుకదా చాలామందికి నరనరాన ఇండియా అంటేనే ధ్వేషం నిండిపోయుంటుందని. వివిధ సందర్భాల్లో గాయాలపాలైన పాకిస్ధాన్ ఆర్మీ సోల్జర్స్ కు చికిత్సలు చేసేటపుడు ఇండియన్ ఆర్మీ గురించి చాలా చెడ్డగా వినేవాడు. పాకిస్ధాన్ ఆర్మీలో సోల్జర్స్ గాయాలపాలవ్వటానికి ఇండియాకు ఎలాంటి సంబంధంలేకపోయినా నిందలన్నీ ఇండియన్ ఆర్మీ మీదే పడేవి. ఆర్మీలో ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడేమాటలను వినివిని రాణాకు కూడా అవే నిందలు నరనరాన ఇంకిపోయాయి. దాంతో ఇండియా అంటే రాణాలో కూడా ధ్వేషం మొదలైంది.

1990ల్లో భార్యతో కలిసి రాణా పాకిస్ధాన్ నుండి కెనాడ(Canada)కు వలసవెళ్ళాడు. కెనడా పౌరసత్వం తీసుకున్న తర్వాత ఏమైందో ఏమో కొంతకాలానికి అమెరికాలోని చికాగోకు మారిపోయాడు. చికాగోలో ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ నడపటంతో పాటు మరి కొన్ని వ్యాపారాలు చేశాడు. ఆ సమయంలోనే అంతర్జాతీయ టెర్రరిస్టు డేవిడ్ హెడ్లీతో పరిచయమైంది. అప్పటికే హెడ్లీకి పాకిస్ధాన్ ఆర్మీతో పాటు ఇండియా అంటేనే ధ్వేషం నింపుకున్న లష్కర్ టెర్రరిస్టు సంస్ధతో బాగా సన్నిహిత సంబంధాలున్నాయి. హెడ్లీతో పరిచయం స్నేహంగా మారిన తర్వాత రాణా లష్కర్ సంస్ధకు పరిచయం అయ్యాడు. అక్కడినుండి టెర్రరిస్టు సంస్ధతో రాణాకు పరిచయం పెరిగిపోయి బాగా సన్నిహితమైపోయాడు. లష్కర్ తోయిబాతో పెరిగిపోయిన సన్నిహితంతోనే హెడ్లీ, రాణా ఇద్దరూ కలిసి ముంబాయ్ పేలుళ్ళకు ప్లాన్ చేశారు. ముంబాయ్ బాంబుపేలుళ్ళతో డైరెక్టుగా రాణాకు కనెక్షన్ లేకపోయినా టెర్రరిస్టులకు బాంబుల మెటీరియల్ సరఫరా చేయటం, అవసరమైన డబ్బు, వాహనలు సమకూర్చినట్లు దర్యాప్తుసంస్ధలు ఆధారాలను సంపాదించాయి.

రాణా ఎలాపట్టుబడ్డాడు ?

డానిష్ న్యూస్ పేపర్ ‘జాయ్ ల్యాడ్స్-పోస్టెన్’ లో మహమ్మద్ ప్రవక్త మీద 2009లో వివాదాస్పద కర్టూన్లు ప్రచురితమయ్యాయి. మహమ్మద్ ప్రవక్తను కించపరుస్తు కార్టూన్లు వేసినందుకు సదరు న్యూస్ పేపర్లో పనిచేసిన ఉద్యోగులను చంపటానికి టెర్రరిస్టులు ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ లో రాణా కీలకమైన పాత్రను పోషించాడు. టెర్రరిస్టు సంస్ధ ఎటాక్ చేయాలని ప్లాన్ చేసిన ఉద్యోగుల్లో అమెరికన్ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఎటాక్ ఫెయిలైనా దాడి ప్లాన్ విషయమై అమెరికా దర్యాప్తుసంస్ధలు చేసిన విచారణలో రాణా హస్తం ఉన్నట్లు ఆధారాలు దొరికాయి. తర్వాత జరిగిన గాలింపులో రాణా దొరికాడు. రాణాను విచారించినపుడు, మరికొందరు టెర్రరిస్టుల విచారణలో ముంబాయ్ బాంబుపేలుళ్ళలో కూడా రాణా పాత్ర బయటపడింది. అదే సమాచారాన్ని అమెరికా దర్యాప్తుసంస్ధలు ఇండియాలోని ఎన్ఐఏకి చేరవేశాయి.

అప్పటికే ముంబాయ్ పేలుళ్ళ కేసును సీరియస్ గా విచారిస్తున్న ఎన్ఐఏ, అమెరికా అందించిన సమాచారంతో రాణాపైన కూడా కేసులు నమోదుచేసింది. న్యూస్ పేపర్ ఉద్యోగుల మీద ఎటాక్ విచారణతో పాటు ముంబాయ్ పేలుళ్ళ కేసులో రాణా పాత్రపై అమెరికా ఇంటెలిజెన్స్ దర్యాప్తుచేసింది. అయితే న్యూస్ పేపర్ ఉద్యోగుల మీద దాడి ప్లాన్ లో రాణా పాత్రపై ఆధారాలు దొరికినా ముంబాయ్ పేలుళ్ళ ఘటనలో ఆధారాలు దొరకలేదు కాబట్టి అమెరికా సుప్రింకోర్టు ఆ కేసును కొట్టేసింది. అయితే అప్పటికే రాణా పాత్రపై సేకరించిన ఆధారాలను అమెరికా కోర్టుకు ఎన్ఐఏ అందించింది. ఆధారాలను అందించటమే కాకుండా రాణాను విచారణ నిమ్మితం ఇండియాకు అప్పగించాలని ఎన్ఐఏ అమెరికా సుప్రింకోర్టులో పిటీషన్ వేసింది. 2013లో అమెరికా సుప్రింకోర్టు రాణాకు 14 ఏళ్ళు జైలుశిక్ష విధించింది.

శిక్షాకాలం పూర్తయి విడుదలవ్వటానికి రాణాకు ఇంకా రెండేళ్ళుంది. అయితే ఈలోగానే రాణాను ఇండియాకు తీసుకొచ్చి విచారణ చేయాలని ఎన్ఐఏ గట్టిగా ప్రయత్నించింది. శిక్షాకాలం పూర్తయి అమెరికా జైలునుండి విడుదలైతే రాణాను పట్టుకోవటం ఇండియాకు సాధ్యంకాదు. అందుకనే అమెరికా జైలులో శిక్షాకాలం పూర్తికాకముందే రాణాను తమకు అప్పగించాలని అమెరికా సుప్రింకోర్టు మీద ఎన్ఐఏ బాగా ఒత్తిడి తీసుకొచ్చింది. కేంద్రప్రభుత్వం కూడా దౌత్యపరంగా చేసిన ఒత్తిడితో రాణా ముందుగానే అప్పగించేందుకు అమెరికా సుప్రింకోర్టు అంగీకరించింది. దాని ఫలితమే రాణా అమెరికా నుండి ప్రత్యేక విమానంలో గురువారం ఇండియాకు రావటం. తమ కస్టడీలో ఉన్న రాణాను ఎన్ఐఏ ఏ విధంగా విచారిస్తుంది ? చేతిలోని ఆధారాలను సుప్రింకోర్టులో చూపించి ఏ విధంగా శిక్ష వేయిస్తుందన్నది ఆసక్తిగా మారింది.

Read More
Next Story