Rosaiah|రోశయ్య స్ధాయి వీళ్ళల్లో ఎంతమందికి ఉంది ?
x
Former CM Konijeti Rosaiah

Rosaiah|రోశయ్య స్ధాయి వీళ్ళల్లో ఎంతమందికి ఉంది ?

ఇపుడు హఠాత్తుగా రోశయ్య ఎందుకు గుర్తుకొచ్చారంటే ఈరోజు మాజీముఖ్యమంత్రి మూడో వర్ధంతి కాబట్టి.


కొణిజేటి రోశయ్య..ఈ పేరుకు పరిచయం అవసరంలేదు. రెగ్యులర్ గా రాజకీయాలను ఫాలో అయ్యేవాళ్ళకి రోశయ్య(Konijeti Rosaiah) గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరంలేదు. ఇపుడు హఠాత్తుగా రోశయ్య ఎందుకు గుర్తుకొచ్చారంటే ఈరోజు మాజీముఖ్యమంత్రి మూడో వర్ధంతి కాబట్టి. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో(Hitex) జరిగిన సంస్మరణ సభలో రేవంత్ రెడ్డి(Revanth reddy)తో పాటు చాలామంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతు రోశయ్య లాంటి వ్యక్తులు లేని లోటు ఇప్పటి రాజకీయాల్లో బాగా తెలుస్తోందన్నారు. ఈమాట నిజమనే చెప్పాలి. ఎందుకంటే తనకు పదవులు కావాలని ఏనాడూ రోశయ్య వెంపర్లాడలేదు. పదవులే రోశయ్యను వెతుక్కుంటూ వచ్చాయి.

అలాగే పదవిలో ఉన్నా లేకపోయినా ఏనాడూ తన పద్దతిని మార్చుకోలేదు. పదవులున్నా, లేకపోయినా చాలా డిసిప్టిన్డ్ గా ఉండేవారు. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఎప్పుడూ ఒకే పద్దతి. రోశయ్యనుండి ఇప్సటి నేతలు నేర్చుకోవాల్సింది ఏమిటంటే సభ్యతా, సంస్కారం. ఎదుటివారికి మర్యాద ఇవ్వటం అన్న పద్దతి ఇపుడు రాజకీయాల్లో టార్చిలైట్ వేసినా కనబడటంలేదు. ఆరోపణలు, విమర్శలు చేయటంలో కూడా రోశయ్యది సపరేటు స్టైలనే చెప్పాలి. వ్యంగ్యం, చెణుకులు, సమయస్పూర్తితో అధికారపక్ష నేతలకైనా ప్రతిపక్షాల నేతలకైనా సమాధానం చెప్పేవారు. రోశయ్యగురించి మాట్లాడాలన్నా, ఆయనపై ఆరోపణలు చేయాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించేవాళ్ళు ఎవరైనా సరే. శాసనమండలిలో తాను ఇరిగేషన్ శాఖ గురించి మాట్లాడినపుడు రోశయ్య తన ఛాంబర్ కు పిలిపించుకుని ప్రోత్సహించారని రేవంత్ గుర్తుచేసుకున్నారు.

మంత్రిగా ఉన్నా, ముఖ్యమంత్రిగా ఉన్నాకూడా అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు ఎవరైనా గట్టిగా మాట్లాడితే అంటే తిడుతు కాదు లాజికల్ గా పాయింట్ బై పాయింట్ మాట్లాడితే పిలిపించుకునో లేకపోతే లాబీల్లో కనిపిస్తేనో అందరిముందే అభినందిచేవారు. సబ్జెక్టు గురించి ఎంతమాట్లాడితే అధికారపక్షం అంతలా ఇరుకునపడుతుందని మంత్రిగానే కాదు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కూడా రోశయ్య చెప్పిన విషయాలను రేవంత్ గుర్తుచేసుకున్నారు. ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వాన్ని పదేపదే ఇరుకునపెట్టిన రోశయ్య అధికారంలో ఉన్నపుడు ప్రతిపక్షాల నుండి ప్రభుత్వాన్ని కంచవేసినట్లుగా కాపాడేవారని రేవంత్ చెప్పటం బాగుంది. నెంబర్ 1గా ఎవరున్నా నెంబర్ 2గా మాత్రమే రోశయ్యే ఉండేవారని రేవంత్ చెప్పారు.

ఆర్ధికమంత్రిగా దాదాపు 15సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారంటేనే ఆయన సామర్ధ్యం ఏంటో అర్ధమవుతోందని రేవంత్ చెప్పారు. రోశయ్య లాంటి సమయస్పూర్తి కలిగిన నేతలు ఇపుడు లేకపోవటం రాజకీయలకు బాగా నష్టంచేస్తోందని రేవంత్ ఒకటికి రెండుసార్లు గుర్తుచేసుకున్నారు. రోశయ్య విగ్రహాన్ని హైదరబాదులో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికైనా రేవంత్ కు రోశయ్య గుర్తుకురావటం సంతోషించాల్సిన విషయమే.

Read More
Next Story