
నీట్ పీజీకి ఆన్ లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
దేశంలోని మెడికల్ కాలేజీల్లో నీట్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) 2025 నోటిఫికేషన్ విడుదలైంది.
దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి నీట్ పీజీ (పోస్ట్ గ్రాడ్యుయేషన్) కోర్సుల్లో ప్రవేశాలకు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) 2025 నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ లో ప్రవేశపరీక్ష ఉంటుంది.
ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 7, 2025వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నీట్ పీజీ పరీక్షను జూన్ 15వ తేదీన దేశ వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ పరీక్షను రెండు షిఫ్టుల్లో ఉదయం, మధ్యాహ్నం ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు.
మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుంచి 12.30 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3.30 నుంచి 7 గంటల వరకు ఉంటుంది.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)-పీజీ 2025కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఎంబీబీఎస్ డిగ్రీ లేదా ప్రొవిజనల్ ఎంబీబీఎస్ కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే ఏడాది ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో మే 7, 2025వ తేదీ రాత్రి 11.55 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు ఇవే..
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మే 07, 2025.
- దరఖాస్తు సవరణ తేదీలు: మే 9 నుంచి 13 వరకు.
- సిటీ ఇంటిమేషన్ వివరాలు విడుదల తేదీ: జూన్ 2
- అడ్మిట్ కార్డులు విడుదల: జూన్ 11, 2025.
- నీట్ పీజీ 2025 పరీక్ష తేదీ: జూన్ 15, 2025.
- ఫలితాల వెల్లడి తేదీ: జులై 15, 2025.
Next Story