భార్య హత్యాయత్నం నుండి తప్పించుకున్న భర్త
x

భార్య హత్యాయత్నం నుండి తప్పించుకున్న భర్త

మహబూబ్ బాద్ జిల్లాలో అమానుషం


మహబూబ్ బాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్య హత్యాయత్నం నుంచి ఓ భర్త ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రియుడితో కల్సి భర్తల హత్యలకు ప్లాన్ చేస్తే తప్పించుకున్న దాఖలాలు తక్కువ.తన భార్య ప్రియుడితో అక్రమ సంబంధం తెలుసుకున్న భర్త ప్రతీరోజు భార్యతో ఘర్షణ పడేవాడు. తమ అక్రమ సంబంధం మధ్య భర్త అడ్డుగా ఉండటంతో ఓ కిరాతక లేడీ ప్రియుడి సాయంతో భర్త ను హత్య చేయడానికి ప్రయత్నించి విఫలమైంది. చివరకు భర్త చెవులను కోసి సంతృప్తి పడింది. చెవులను కోసేయడంతో భర్తకు తీవ్ర రక్త స్రావం అయింది. కుటుంబ సభ్యులు సమీప ఆస్పత్రిలో చేర్పించి బాధితుడికి చికిత్స చేయిస్తున్నారు.

మహబూబ్ బాద్ జిల్లా గడ్డి గూడెం గ్రామంలో ఆదివారం అర్దరాత్రి ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మేడ ప్రసాద్ కు కొత్తగూడెం మండలం గోవిందాపురం గ్రామానికి చెందిన రష్మితో పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి మూడేళ్ల కూతురు ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరి మధ్య కలతల ప్రారంభమయ్యాయి. ఈ కలతలకు మెయిన్ రీజన్ అక్రమ సంబంధం. గంగారం మండలం మర్రిగూడెం గ్రామానికి చెందిన మద్దెల అనిల్ తో రష్మికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారి తీసింది. భర్త మేడ ప్రసాద్ ఇంట్లో లేని సమయంలో మద్దెల అనిల్ రష్మి ఇంటికి వచ్చేవాడు. ఆ నోట ఈ నోట భర్త మేడ ప్రసాద్ చెవిలో పడింది. భార్యా భర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ప్రతీ రోజు గొడవలు జరగడంతో రష్మి ఒక నిర్ణయానికి వచ్చేసింది. ప్రియుడు మద్దెల అనిల్ తో భర్త మేడ ప్రసాద్ ను హత్య చేయాలని ప్లాన్ చేసింది. ఆదివారం అర్దరాత్రి భర్త పడుకున్న సమయంలో ప్రియుడిని పిలిచింది. మేడ ప్రసాద్ పడుకున్నప్పుడు హత్యాయత్నానికి యత్నించారు. అనిల్ గట్టిగా పట్టుకోవడంతో భార్య భర్తపై హత్యాయత్నం చేసింది. చాకుతో దాడి చేయడంతో మేడ ప్రసాద్ చెవులు, చాతిపై తీవ్రగాయాలయ్యాయి. ప్రసాద్ కేకలు విన్న తండ్రి పాపయ్య, ఇతర కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకుని అనిల్ ను చెట్టుకు కట్టేసి దేహశుద్ది చేశారు. ఘటన జరిగిన విషయం పోలీసుల చెవినపడి మేడ ప్రసాద్ ఇంటికి చేరుకున్నారు. హత్యాయత్నం చేసిన రష్మి, మద్దెల అనిల్ ను పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read More
Next Story