
హైదరాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు..
హైదరాబాద్ సహా మరో ఆరు ఎయిర్‌పోర్ట్‌లకు ఈమెయిల్స్.
హైదరాబాద్ విమానాశ్రయాన్ని పేల్చేస్తామంటూ బుధవారం వచ్చిన ఈమెయిల్.. తీవ్ర కలకలం రేపింది. ఢిల్లీ పేలుడు తర్వాత ఈ ఈ-మెయిల్ రావడంతో ప్రభుత్వం అలెర్ట్ అయింది. బుధవారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ఈ ఈ-మెయిల్ వచ్చినట్లు అధికారులు చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న ఐదు ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాలకు ఈ బెదిరింపు వచ్చిందని వెల్లడించారు. వెంటనే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామని, విమానాశ్రయం అంతా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. విమానాశ్రయంలో భద్రతను పెంచినట్లు చెప్పారు.
ఢిల్లీలో బాంబు పేలుడు తర్వాత కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రధాన నగరాలన్నింటినీ అలెర్ట్ చేసింది. పబ్లిక్ ప్లేసెస్‌లో భద్రతను పెంచాలని, అనుమానంగా కనిపించిన వారిని విచారించాలని తెలిపింది. ఆ మేరకు అన్ని ప్రధాన నగారాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్‌లలో భద్రతను పెంచారు. ఇప్పుడు వచ్చిన మెయిల్‌తో భద్రతను మరింత కట్టుదిట్టం చేయనున్నట్లు అధికారులు చెప్పారు.

