Cycling Friendly City |  సైక్లింగ్ ఫ్రెండ్లీ సిటీగా హైదరాబాద్‌
x

Cycling Friendly City | సైక్లింగ్ ఫ్రెండ్లీ సిటీగా హైదరాబాద్‌

హైదరాబాద్ నగరాన్ని సైక్లింగ్ ఫ్రెండ్లీ సిటీగా తీర్చిదిద్దాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డికి బైసైకిల్ మేయర్ ఆఫ్ హైదరాబాద్ విన్నవించింది.


హైదరాబాద్ మహా నగరంలో మెరుగైన ప్రజారవాణ కోసం బైసైకిల్ హైదరాబాద్ సంఘం గురువారం సీఎం రేవంత్ రెడ్డికి పలు సూచనలు చేసింది.సైక్లింగ్ ఫ్రెండ్లీ సిటీగా నగరాన్ని తీర్చిదిద్దాలని, వాకింగ్, రైడింగ్ బైసైకిల్, ప్రజారవాణ కోసం కొత్త టెక్నాలజీతో మెరుగైన చర్యలు తీసుకోవాలని, సైక్లింగ్ ట్రాక్ లు నిర్మించాలని సూచించింది.

- హైదరాబాద్ నగరాన్ని సైక్లింగ్ ఫ్రెండ్లీ సిటీగా తీర్చిదిద్దాలని బైసైకిల్ మేయర్ ఆఫ్ హైదరాబాద్ సంథానా సెల్వన్ సీఎంకు సమర్పించిన వినతిపత్రంలో కోరారు. వాకింగ్, సైక్లింగ్ ట్రాక్ నిర్మించి, పాఠశాల, కళాశాల విద్యార్థుల కోసం ప్రజారవాణను మెరుగుపర్చాలని సెల్వల్ సూచించారు.

సైక్లింగ్ లైన్లు నిర్మించండి
నగరంలోని అన్ని ప్రాంతాల్లో బైసైకిల్ లైన్లను నిర్మించాలని సైక్లింగ్ సమాఖ్య కోరింది. సైకిళ్ల పార్కింగ్ కోసం స్థలాలు కేటాయించాలని, ప్రజల కోసం షేరింగ్ సైకిళ్లను అందుబాటులోకి తీసుకురావాలని, ఫుట్ పాత్ లు నిర్మించాలని, సురక్షిత బస్సు స్టాప్ లు, పబ్లిక్ టాయ్ లెట్లు, చార్జింగ్ స్టేషన్లు నిర్మించాలని కోరారు. సైక్లింగ్, వాకబులిటీని పెంచేందుకు సౌకర్యాలు కల్పించేలా తెలంగాణ అసెంబ్లీలో యాక్టివ్ మొబిలిటీ బిల్లును పాస్ చేయాలని సెల్వన్ సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా సైక్లింగ్ విప్లవం వస్తున్నందున పాదచారులు, సైక్లిస్టులు సురక్షితంగా ప్రయాణం చేసేందుకు వీలు కల్పించాలని సెల్వన్ డిమాండ్ చేశారు. షాపింగ్ స్ట్రీట్లలో వాకింగ్, సైక్లింగ్ ను మాత్రమే అనుమతించాలని కోరారు.



బస్సుల సంఖ్య పెంచండి

హైదరాబాద్ నగరంలో ప్రజారవాణను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవాలని సైక్లింగ్ సమాఖ్య కోరింది. నగరంలో 15వేల టీజీఆర్టీసీ బస్సులు అవసరం కాగా ప్రస్థుతం 2,900 బస్సులే తిరుగుతున్నాయని బైసైకిల్ మేయర్ ఆఫ్ హైదరాబాద్ సంథానా సెల్వన్ చెప్పారు. సురక్షిత అనువైన ప్రయాణం కోసం బస్సుల సంఖ్యను పెంచాలని కోరారు.నగరంలో కారు ఫ్రీ జోన్లు,విద్యార్థుల కోసం స్కూల్ జోన్లు ఏర్పాటు చేయాలని, నగరవ్యాప్తంగా అన్ని ప్రాంతాలను కలుపుతూ మల్టీమోడల్ ట్రాన్స్ పోర్ట్ సిస్టం అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

ఫిట్ ఇండియా సైక్లింగ్

సైక్లింగ్ సౌకర్యాలతో హైదరాబాద్ నగరంలో ఆరోగ్యకర, పర్యావరణ హిత, ఆనందాల హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాలని సీఎంకు సైక్లిస్టులు సూచించారు. ఫిట్ ఇండియా సైక్లింగ్ కార్యక్రమంలో భాగంగా ప్రతీ మంగళవారం సైక్లింగ్ చేయాలని నిర్ణయించారు. పొల్యూషన్ కా సొల్యూషన్, పెడల్ కా ఫిట్ నెస్ పేరిట కాలుష్య రహిత సైక్లింగ్ కార్యక్రమాన్ని 1000 ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా చేపట్టారు. సైక్లింగ్ వల్ల మీ గుండె ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చని, శరీరంలోని కేలరీలను కరిగించవద్చని సెల్వన్ చెప్పారు. సైక్లింగ్ తో మీ కండరాలను ధృడం చేసుకోవడానికి ఫిట్ నెస్ కా సవారీ మంగళవార్ సే జారీ అంటూ సైక్లిస్టులు హైదరాబాద్ నగరంలో ప్రతీ మంగళవారం సైకిల్ సవారీని ఎంచుకుంటున్నారు.






Read More
Next Story