హైదరాబాద్‌ బుక్ ఫెయిర్‌కు వేళాయే..
x

హైదరాబాద్‌ బుక్ ఫెయిర్‌కు వేళాయే..

హైదరాబాద్లో 37వ పుస్తక ప్రదర్శన (37th Hyderabad Book Fair)కు ముహూర్తం ఖారారు అయింది.


హైదరాబాద్‌లో 37వ పుస్తక ప్రదర్శన (37th Hyderabad Book Fair)కు ముహూర్తం ఖారారు అయింది. దీనిని డిసెంబర్ 19 నుంచి 29 వరకు నిర్వహించాలని పుస్తక ప్రదర్శన సొసైటీ నిశ్చయించింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసింది. ఈ మేరకు సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోదండరామ్, సీనియర్ సంపాదకులు కె. రామచంద్రమూర్తి, పుస్తక ప్రదర్శన సలహాదారు ఆచార్య రమా మెల్కోటె సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుస్తక ప్రదర్శనకు సంబంధించిన లోగోని ఆవిష్కరించారు. మొత్తం 300 స్టాళ్లను ఏర్పాటు చేస్తామని.. ఇందుకోసం త్వరలోనే లాటరీ నిర్వహించనున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు. సందర్శకులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

ప్లాస్టిక్ నిషేధాన్ని పాటిస్తూ.. సందర్శకుల కోసం టికెట్లతో పాటు పుస్తకాల కోసం 'సంచి'ని ఇస్తామని తెలిపారు. రచయితలు, పబ్లిషర్లు తమ స్టాళ్లను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. విద్యార్థులకు తమ ఐడీ కార్డులతో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. వివరాల కోసం 9490099081ను సంప్రదించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి నారాయణ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్లు కె.బాల్ రెడ్డి, శోభన్ బాబు, జాయింట్ సెక్రటరీలు కె. సురేశ్, ఎం. సూరిబాబు, ఈసీ సభ్యులు జనార్దన్ గుప్తా, విజయారావు, మధుకర్, కోటేశ్వర రావు, శ్రీకాంత్, శ్రీనివాసరావు, సాంబశివరావు, స్వరాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Read More
Next Story