హైదరాబాద్ కలెక్టర్ హరిచందన హైటెక్ పాలన, ఎలాగంటే...
x
హైదరాబాద్ ప్రజల చెంతకు కలెక్టర్ దాసరి హరిచందన పాలన

హైదరాబాద్ కలెక్టర్ హరిచందన హైటెక్ పాలన, ఎలాగంటే...

హైదరాబాద్ జిల్లాలో డిజిటల్ గవర్నెన్స్ పౌరుల చెంతకు పాలన


హైదరాబాద్ జిల్లాలోని సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులతోపాటు పౌరులకు శుభవార్త. జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రతీ సోమవారం హైదరాబాద్ కలెక్టరు దాసరి హరిచందన తన కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఇక సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు నేరుగా హాజరుకానవసరం లేదు. వారు కేవలం వాట్సాప్ ద్వారా కలెక్టరుకు వారి పిటిషన్లను సమర్పించుకోవచ్చు. ఈ కొత్త డిజిటల్ పాలన హైదరాబాద్ జిల్లాలో అమలులోకి తీసుకువస్తూ జిల్లా కలెక్టరు దాసరి హరిచందన ఆదేశాలు జారీ చేశారు. దీనివల్ల సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు ఉపశమనంతో పాటు రవాణా ఖర్చులను నివారించుకోవచ్చు.




పౌరుల చెంతకు పాలన

హైదరాబాద్ పౌరుల చెంతకు పాలన అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ జిల్లాలో డిజిటల్ గవర్నెన్స్ ను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఇక మీ ఫిర్యాదులను వాట్సాప్ ద్వారా దాఖలు చేయవచ్చని కలెక్టర్ దాసరి హరిచందన ప్రకటించారు.మీరు ఏదైనా సమస్యపై ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ పాలనా యంత్రాంగమే డిజిటల్ గవర్నెన్స్ ద్వారా వాట్సాప్ లో మీరు ఫిర్యాదు చేస్తే చాలు పాలన మీ చెంతకు వస్తుందని కలెక్టర్ హరిచందన చెప్పారు.

వాట్సాప్ ఫిర్యాదుల పరిష్కారం ఇలా...
మీ ఫిర్యాదును 74166 87878 వాట్సాప్ నంబరుకు పంపిస్తే చాలు, ఎస్ ఎం ఎస్ ద్వారా మీ ఫిర్యాదును నిర్ధారించుకొని, దీనికి ఫిర్యాదు ఐడీని క్రియేట్ చేస్తారు. మీ ఫిర్యాదు అందిందని పిటిషనరుకు సమాధానం కూడా ఇస్తారు. మీ ఫిర్యాదును డౌన్ లౌడ్ చేసుకొని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆన్ లైన్ పోర్టల్ లో వీటిని నమోదు చేస్తారు. మీరు చేసిన ఫిర్యాదుపై యాక్షన్ టేకెన్ రిపోర్టును సంబంధిత ప్రభుత్వ శాఖల నుంచి తెప్పించి వాటిని మీ వాట్సాప్ ద్వారా మీ ఫోన్ కు పంపిస్తారు.



వాట్సాప్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ

హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి వాట్సాప్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ సదుపాయాన్ని 74166 87878 నంబరుతో ప్రారంభించారు. దీనివల్ల ఫిర్యాదుల పరిష్కారాన్ని మెరుగుపరచడానికి, పౌర స్నేహపూర్వక పాలనను ప్రోత్సహించడానికి ఉపయోగపడనుంది. పౌరులు ఇప్పుడు ప్రతీ సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా లేదా ఆన్‌లైన్ పోర్టల్‌ను ఉపయోగించకుండా ఇంటి నుంచే సులభంగా ఫిర్యాదులు చేయవచ్చు. ఈ వాట్సాప్ గవర్నెన్స్ వల్ల వృద్ధులు, వికలాంగులు , పని చేసే నిపుణులకు ప్రయోజనం కలుగుతుందని కలెక్టర్ హరిచందన వివరించారు.


Read More
Next Story