ప్రపంచంలోని విచిత్ర కట్టడాల జాబితాలో ‘‘హైదరాబాద్ ఫిష్ బిల్డింగ్’’
'ఫిష్ బిల్డింగ్' కేవలం కార్యాలయం కాదు. కళాత్మక నిర్మాణం. ఇది ఒక సంస్థ ఉద్దేశ్యాన్ని ప్రతిబింబించే కట్టడం. హైదరాబాద్‌లో ఈ బిల్డింగ్ ఉంటుంది.
మీరు విన్నది నిజమే. హైదరాబాద్‌లోని ‘‘ఫిష్ బిల్డింగ్’’ ప్రపంచంలో విచిత్రంగా నిర్మించిన కట్టడాల జాబితాలో చేరింది. వాస్తవానికి ఇది నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ (NFDB) ప్రధాన కార్యాలయం. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున ఉంది. ఈ భవనం మొదట్లో స్థానికులు, సందర్శకులను పెద్దగా ఆకట్టుకోలేదు. కట్టడం కొత్తగా ఉందని మాత్రం ఆ నోట, ఈ నోట వినిపించింది. అచ్చం చేప ఆకృతిలో నిర్మించిన ఈ భవనం రాత్రివేళ నీలిరంగు స్పాట్లైట్లతో మిరుమిట్లు గొలుపుతుంది.
విచిత్ర కట్టడాల జాబితాలో ఈ భవనాలు కూడా..
ప్రపంచవ్యాప్తంగా కొన్ని విచిత్ర కట్టడాలున్నాయి. ఇండియాలోనూ కొన్ని ఉన్నాయి.
లాంగాబెర్గర్ బాస్కెట్ బిల్డింగ్..బాస్కెట్ ఆకారంలో ఉన్న ఈ భవనం USAలోని ఒహియో ఉంటుంది. ఇది లాంగాబెర్గర్ కంపెనీ ప్రధాన కార్యాలయం.
పోలాండ్లోని క్రూక్డ్ హౌస్, కెనడాలోని హాఫ్ హౌస్, ఫ్లోరిడాలోని సెమినోల్ హార్డ్ రాక్ హోటల్, క్యాసినో హాలీవుడ్ కూడా కళాత్మక నిర్మాణాలు. జర్మనీ మ్యూనిచ్‌లోని BMW టవర్‌ను1973లో ప్రారంభించారు. ఇంజిన్ సిలిండర్ల ఆకారంలో ఉంటుంది. జపాన్‌లో ఒక పండు ఆకారంలో బస్ స్టాప్ ఉంది.
ఇక భారతదేశంలో..
ఎక్కువ మంది సందర్శించే కట్టడాలలో ఢిల్లీలోని లోటస్ టెంపుల్ కూడా ఒకటి. అసాధారణ రీతిలో 9-వైపుల పూల ఆకృతికి పోలి ఉండడం దీని ప్రత్యేకత.
తెలంగాణ వేములవాడలో లక్ష్మీ నరసింహ ఆలయం పాము ఆకారంలో ఉంటుంది. చెన్నై నార్త్ మాధవరంలో లెదర్ ఇండస్ట్రీకి గుర్తుగా షూ ఆకారంలో భవనాన్ని నిర్మించారు.