స్వీట్ సంక్రాంతికి ముస్తాబవుతున్న హైదరాబాద్
x

స్వీట్ సంక్రాంతికి ముస్తాబవుతున్న హైదరాబాద్

ఈ ఏడాది కైట్ ఫెస్టివల్ చాలా స్పెషల్ గురూ. వందల రకాల స్వీట్లతో ఔరా అనిపించడానికి సర్కార్ సై అంటోంది.


సంక్రాంతి అనగానే నాకు నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. స్కూళ్లకు సెలవులు ఇచ్చేయడంతో స్నేహితులతో కలిసి ఆ మట్టి రోడ్లపై పరిగెడుతూ పతంగులు ఎగరవేసిన రోజులు ఇప్పటికీ నా కళ్ల ముందు మెదులుతాయి. గంటల తరబడి ఆడుకుని ఆకలితో ఇంటికెళ్లే సరికి రకరకాల రుచికరమైన పిండి పదార్థాలను రెడీ చేసి అమ్మ సిద్ధంగా ఉంచేది. వాటిని లొట్టలేసుకుంటూ ఆరగిస్తుంటే ఆ ఫీలే వేరు. పెద్దాయ్యాక అవన్నీ కాస్తంత మిస్ అవుతున్నా.. అమ్మ చేతి వంట రుచి చూడటానికైనా సంక్రాంతికి తప్పకుండా ఊరెళ్తాను. కానీ ఈ ఏడాది నా సంక్రాంతి ప్లాన్స్‌లో చిన్న ఛేంజ్ చేసుకున్నా. హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న 7వ ఇంటర్నేషనల్ కైట్స్ ఫెస్టివలే అందుకు కారణం.


అక్కడ వందల సంఖ్యలో పతంగులు ఎగురుతుంటే చూడాలని నేను ఊరు వెళ్లకుండా ఆగడం లేదు. ఈ ఏడాది ప్రభుత్వ నిర్వహిస్తున్న కైట్ ఫెస్టివల్‌లో నన్న ఆకట్టుకున్న విషయం వారు అందుబాటులో ఉంచనున్న స్వీట్లు. ఇండియాలోని ఇతర రాష్ట్రాలతో పాటు పలు దేశాల్లో ఫేమస్ అయిన స్వీట్లను కూడా అక్కడ అందుబాటులో ఉంచనున్నారట. నేనేమో స్వీట్ ప్రియుడిని.. మరి వాటిని రుచి చూడకుంటే ఎలా. అందుకే ప్లాన్స్‌ను కాస్త మార్చుకుని.. ఈ ఏడాది కైట్ ఫెస్టివల్‌కు వెళ్లి వీలైనన్న స్వీట్లు రుచి చూడాలని డిసైడ్ అయ్యా. ఈ వేడుకలకు సంబంధించి ఇప్పటికే అధికారులు, మంత్రి జూపల్లి చెప్పిన మాటలు విని నాకు ఇప్పటి నుంచే నోరూరిపోతోంది. అన్ని రకాల స్వీట్లు నా కళ్ల ముందు మెదులుతుంటేనే ఆ అనుభూతి ఔరా అనిపిస్తోంది. ఈ వేడుకను నెవ్వర్ బిఫోర్ అనేలా నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. మరి ఎలా నిర్వహిస్తున్నారో ఆ విసేషాలేంటో తెలుసా..

ఈ పతంగుల పండుగకు అంతర్రాష్ట్రాల్లో పతంగులు ఎగురవేసే కైట్ ఫ్లయర్స్‌ను ఇప్పటికే ఆహ్వానించారు. ఈ వేడుకల్లో వెయ్యి రకాల స్వీట్స్ పెట్టాలని కూడా ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర పర్యాటక, భాషా సంస్కృతి శాఖ వెల్లడించింది. ఈ వేడుకల్లో పతంగులు ఎగరవేయడం కోసం ఇండోనేషియా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, కెనడా, కాంబోడియా, స్కాట్లాండ్, కొరియా, థాయ్‌లాండ్, వియత్నాం, ఇటలీ, సైత్ ఆఫ్రికా, మలేషియా, తైవాన్ సహా పలు ఇతర దేశాలకు చెందిన కైట్ ఫ్లయర్స్‌ హైదరాబాద్‌కు వచ్చేస్తున్నారు. వీరితో పాటుగా అనేక ఇతర దేశాల స్వీట్ స్పెషలిస్ట్‌లు కూడా ఈ వేడుకల్లో భాగస్వామ్యం కానున్నారు. ఈ స్వీట్ల ఏర్పాట్లు అధికారులు దగ్గర ఉండి చూసుకోనున్నట్లు తెలిపింది. దీంతో ఈ స్వీట్ సంక్రాంతి భోజనప్రియులను ఆకర్షిస్తోంది.

కైట్ ఫెస్టివల్‌తో పాటు స్వీట్ల పండుగను కూడా జరపాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దేశ విదేశాల నుంచి వచ్చే కైట్ ఫ్లయర్స్‌కు నోరూరించే భారత స్వీట్ల రుచి చూపించాలని నిశ్చయించుకుంది. తెలుగువారి ఇళ్లలో తయారు చేసుకునే తీపి పదార్థాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ వంటకాలు, స్వీట్లను ఈ వేడుకలో అందుబాటులో ఉంచనున్నారు. ఈ వార్త వినడంతోనే ఈ వేడుకు హాజరయ్యేందుకు భోజన ప్రియులు తెగ ఉబలాటపడుతున్నారు. హైదరాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో జరిగే ఈ వేడుకల్లో పెట్టే స్వీట్స్‌ రుచి చూడాల్సిందేనని ఫుడ్ వ్లాగర్స్ కూడా ఉవ్విల్లూరుతున్నారు. ఈ స్వీట్స్ కోసం ప్రత్యేక స్టాళ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. మొత్తం 1100 జాతీయ, అంతర్జాతీయ స్వీట్లు, పిండి వంటలను అందుబాటులో ఉంచనున్నారు. ఇరాన్, తుర్కియే, అప్ఘనిస్థాన్‌తో పాటు తొమ్మిది దేశాలకు చెందిన 700 మంది హోమ్ మేకర్స్ ఈ స్వీట్స్ ప్రదర్శనలో పాల్గొననున్నారు. ఈ వేడుకలకు 15 లక్షల మంది వరకు హాజరుకావొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తోంది.

ఔరా అనేలా వేడుకల: జూపల్లి

‘‘కైట్ ఫెస్టివల్‌తో పాటు స్వీట్ ఫెస్టివల్ కూడా నిర్వహించనున్నాం. ఈ వేడుకలలో ఆహా! అనిపించే అన్ని రకాల స్వీట్స్‌ను అందుబాటులో ఉంచనున్నాం. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ వేడుకలు నిర్వహిస్తున్నాం. వీటికి ఎటువంటి ఎంట్రీ ఫీజు లేదు. రానున్న రోజుల్లో ఈ కైట్ ఫెస్టివల్‌ను అన్ని ప్రాంతాలకు విస్తరిస్తాం. ఈ వేడుక వల్ల తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు అందరికీ తెలుస్తాయి. స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో 19 దేశాలకు చెందిన 47 మంది కైట్ ఫ్లయర్స్ పాల్గొననున్నారు’’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

స్వీట్ ప్రియులకు స్వర్గమే

పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే ఈ వేడుకలు స్వీట్స్ పరియులకు స్వర్గంలా అనిపించడం ఖాయం. రకరకాల స్వీట్స్ ఉండటమే కాకుండా సరికొత్త స్వీట్స్‌ను ట్రై చేయడానికి కూడా వారికి ఒదొక అద్భుత అవకాశం. అన్ని రకాల స్వీట్స్‌ను రుచి చూసి ఆ తియ్యని దనంలో తమనుతాము మర్చిపోయే రోజు ఎంతదూరంలో లేదు. కేవలం భారతదేశంలో దొరికే తీపి పదార్థాలే కాకుండా ఇతరదేశాల్లో ఫేమస్ అయిన స్వీట్లను కూడా ఇక్కడ అందుబాటులో ఉంచనున్నారు. స్వీట్లంట్ అమితంగా ఇష్టపడే వారికి రకరకాల స్వీట్స్ ట్రై చేయడానికి ఈ స్వీట్ ఫెస్టవల్ సరైన ప్రదేశం కానుంది. దానికి తోడు ఎంట్రీ ఫీజు కూడా లేకపోవడంతో భారీ సంఖ్యలో ప్రజలు ఈ వేడుకలకు హాజరుకానున్నట్లు సమాచారం. ఈ వేడుక స్వీట్ ప్రియులకు నిజమైన సంక్రాంతిని పరిచయం చేయనుంది. అంతేకాకుండా ఎప్పుడిప్పుడే కనుమరగయ్యేలా ఉన్న అనేక రకాల తీపి పదార్థాలను కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా తయారు చేయించి ఈ వేడుకల్లో అందుబాటులో ఉంచనుంది.

Read More
Next Story