![Hyderabad Happy Streets |ఆనందాల వీధుల్లో ఈ ఆదివారం సరదాగా గడపండి Hyderabad Happy Streets |ఆనందాల వీధుల్లో ఈ ఆదివారం సరదాగా గడపండి](https://telangana.thefederal.com/h-upload/2025/02/08/511313-happy.webp)
హ్యాపీ స్ట్రీట్ కార్యక్రమంలో యువత డాన్స్ (చిత్రం ఎక్స్ సౌజన్యంతో)
Hyderabad Happy Streets |ఆనందాల వీధుల్లో ఈ ఆదివారం సరదాగా గడపండి
హైదరాబాద్ నెక్లెస్ రోడ్డుపై ‘హ్యాపీ స్ట్రీట్’ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించనున్నారు. యోగా, జుంబా, ఫిట్ నెస్ డాన్స్, డీజేతో హుసేన్ సాగర్ తీరం మార్మోగనుంది.
మూడు వైపులా జలాలతో కూడిన హుసేన్ సాగర్ తీరం...చుట్టూ పచ్చని చెట్లు...పచ్చదనాన్నిచ్చే పచ్చిక బయళ్లు...విశాలమైన పీపుల్స్ ప్లాజా...ఆహ్లాదాన్నిచ్చే హైదరాబాద్ నగరంలోని నడిబొడ్డున ఉన్న నెక్లెస్ రోడ్డుపై ఈ ఆదివారం (రేపు) హ్యాపీ స్ట్రీట్ వినూత్న కార్యక్రమాన్ని హైదరాబాదీలు చేపట్టనున్నారు.
- ఈ నెల 9వతేదీన ఆదివారం ఉదయం ఆరున్నర గంటల నుంచి పది గంటల వరకు నెక్లెస్ రోడ్డుపై పీపుల్స్ ప్లాజా వద్ద ఆనందాల వీధుల్లో సరదాగా గడుపుదాం రండి అంటూ నిర్వాహకులు నగర యువతను ఆకట్టుకుంటున్నారు.సండే ఫన్ డే పేరిట సాగనున్న ఈ కార్యక్రమం అందరినీ అలరించనుంది.
సండే ఫన్ డే
హ్యాపీ స్ట్రీట్ లో భాగంగా యోగా,ధ్యానం, జుంబా డాన్స్,ఫిట్ నెస్ డాన్సులు, ర్యాప్, ఫ్లాష్ మాబ్ ఇలా ఒకటేమిటీ లక్కీ డ్రాలు, వీనుల విందు చేసే మార్నింగ్ బీట్స్ డీజేలు నగర యువతను ఆనంద డోలికల్లో ముంచెత్తనుంది. ఈ హ్యాపీ స్ట్రీట్ నగర వాసులకు మర్చిపోలేని మధుర అనుభూతులను మిగులుస్తుందని నిర్వాహకులు ప్రకటించారు. ఈ ఆనందాల వినోద కార్యక్రమంలో బోధి యోగా యోగా, మెడిటేషన్ కార్యక్రమాలు చేపట్టనున్నారు. దీపక్ మౌర్యా జుంబా, ఫిట్ నెస్ డాన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
నగరవాసుల నుంచి అనూహ్య స్పందన
ఫిట్ నెస్ డాన్స్ ద్వారా వర్క్ అవుట్ చేపిస్తారు. లయోలా కళాశాల విద్యార్థులు ఫ్లాష్ మాబ్ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. జాయ్ అలుకాస్ లక్కీడ్రా, గోల్టెన్ గెస్ట్ ను ఎంపిక చేయనుంది. డీజే అంజద్ మలిక్ మార్నింగ్ బీట్స్ పేరిట తనదైన సంగీతంతో ప్రేక్షకులకు వీనుల విందు చేయనున్నారు. ఇన్ని ఆనందాల హ్యాపీ స్ట్రీట్ కార్యక్రమాన్ని డోంట్ మిస్ అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేపట్టారు. సోషల్ మీడియాలో సాగుతున్న ఈ ప్రచారానికి నెటిజన్లు, నగరవాసుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది.
ఫన్ తో ఒత్తిడి దూరం
నిత్యం పనులతో బిజీ బిజీగా గడుపుతున్న నగర ప్రజలు ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఆటవిడుపుగా హైదరాబాద్ నగరంలో హ్యాపీ స్ట్రీట్ కార్యక్రమాన్ని చేపట్టారు. కోల్ కతా, ముంబయి, పూణే నగరాల్లో సాగే హ్యాపీ స్ట్రీట్ కార్యక్రమాలు హైదరాబాద్ నగరంలో మూడోసారి చేపట్టనున్నారు. క్రీడలు, వినోద కార్యక్రమాలతో మానసికోల్లాసానికి వేధిక గా హ్యీపీ స్ట్రీట్ సందడి చేయనుంది. ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం కోసం ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని ఐటీ ఉద్యోగిని డి భాగ్యలక్ష్మి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
ఆనందాల హరిజల్లు
ఫ్రెండ్లీగా పచ్చని చెట్లు, ఆహ్లాదంగా ఉన్న పరిసరాల్లో హైదరాబాద్ నగరంలో హ్యాపీ స్ట్రీట్ నగరవాసులకు ఆనందాల హరిజల్లు కురిపించనుంది. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమహేంద్రవరంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో హ్యాపీ స్ట్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.‘‘హైదరాబాద్ నగరంలో ఈ ఆదివారం యోగా, జుంబా, రాప్, ఫ్లాష్ మాబ్‌లు, లక్కీ డ్రాలు అండ్ మరిన్నింటి వినోదాల విందు కోసం హ్యాపీ స్ట్రీట్స్‌లో చేరండి’’అంటూ నిర్వాహకులు ఆహ్వానించారు. సైక్లింగ్, యోగా, నృత్యం,ఫిట్‌నెస్,ఉత్సాహభరితమైన ఉదయం కోసం మరిన్ని కార్యక్రమాలతో ఆదివారం ఉదయం గడపడానికి హ్యాపీ స్ట్రీట్స్‌లో చేరండి. హ్యాపీ హైదరాబాద్ సైక్లిస్ట్, రన్నర్స్ మీట్ బజారాహిల్స్ నిలోఫర్ కేఫ్ కేంద్రంగా కలవనున్నారు. హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్ మంగళవారం సైక్లింగ్ ఫోస్ట్ మ్యాన్ సపోర్టింగ్ ఫిట్ ఇండియా కార్యక్రమాలు చేపట్టింది.
Next Story