
వజ్రాల వ్యాపారిని బెదిరించిన కేసులో డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్, ఇద్దరు కానిస్టేబుళ్ల పై వేటు
ఉత్త ర్వులు జారి చేసిన హైద్రాబాద్ కమిషనర్
ఈజీ మనీకి అలవాటుపడ్డ కొందరు నేరాలకు తెగబడుతున్నారు. నయానో భయానో బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న కేటుగాళ్లు ఉండనే ఉన్నారు. వజ్రాల వ్యాపారిని బెదిరించిన కేసులో సికింద్రాబాద్ మహంకాళీ పోలీస్ స్టేషన్ డిటెక్టిక్ సబ్ ఇన్స్ పెక్టర్ తో బాటు ఇద్దరు కానిస్టేబుళ్లను హైద్రాబాద్ నగర పోలీస్ కమిషనర్ సస్పెండ్ చేశారు. గత నెల 31న కడపకు చెందిన వజ్రాలవ్యాపారి కోటి రూపాయల విలువ చేసే వజ్రాలతో జనరల్ బజార్ లో వివిధ వజ్రాల వ్యాపారులకు విక్రయించడానికి వచ్చాడు.
కోటి రూపాయల వజ్రాలకు సంబంధించి అన్ని బిల్లులు ఉన్నప్పటికీ మహంకాళీ పోలీస్ స్టేషన్ లో డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్ గా పని చేస్తున్న ప్రసాద్, కానిస్టుబుళ్లు శ్యాం, మహేష్ లు సదరు వ్యాపారిని బెదిరించి వజ్రాలను ఎత్తుకెళ్లారు. తన వద్ద అన్ని బిల్లులు ఉన్నాయని చెప్పినప్పటికీ పోలీసులు వినకుండా వెళ్లిపోయారు. ఆ రోజు నుంచి ప్రతీ రోజు పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన వజ్రాలను తిరిగిచ్చేయాలని మొరపెట్టుకున్నాడు.అయినా వజ్రాల వ్యాపారి మీద కేసు నమోదు చేశారు. కేసును ఉపసంహరించాలంటే రూ 6 లక్షలు ఇవ్వాలని పోలీసులు డిమాండ్ చేశారు. ఆ డబ్బును తన ఫ్రెండ్ ఖాతాలో జమ చేయాలని డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్ చెప్పాడు . ఈ ఒప్పందాన్ని ఒప్పుకున్నసదరు వజ్రాల వ్యాపారీ డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్ ఫ్రెండ్ ఖాతాలోజమ చేశాడు.తన వజ్రాలను పోలీసుల నుంచి స్వాధీనం చేసుకున్నాడు.
డబ్బు ట్రాన్స్ ఫర్ చేసిన కొద్దిసేపటికే సదరు వ్యాపారి బ్యాంకుకు వెళ్లి తన అకౌంట్ నుంచి తన ప్రమేయం లేకుండానే రూ. 6 లక్షలు మాయమయ్యాయని కంప్లైట్ చేశాడు. బ్యాంకు అధికారులు విషయాన్ని పోలీసుల దృష్టి తీసుకువచ్చారు. సదరువ్యాపారి పోలీసు ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. విచారణ చేసిన పోలీసులు ఆధారాలు సేకరించారు. డిటెక్టివ్ ఇన్సె పెక్టర్ ప్రసాద్ , ఇద్దరు కానిస్టేబుళ్లు నేరానికి పాల్పడినట్టు విచారణలో తేలడంతో నగర పోలీస్ కమిషనర్ వారిని సస్పెండు చేశారు. వ్యాపారి నుంచి డబ్బు వసూలు చేసిన పోలీసులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.