HYDERABAD RISING|ఆరు హై సిటీల్లో రూ.3,666.50 కోట్లతో అభివృద్ధి పనులు
తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఏడాది పాలనలో అభివృద్ధికి పలు పథకాలు ప్రకటించింది.హైదరాబాద్ రైజింగ్ పేరిట ఆరు నగరాలుగా విభజించి వినూత్న అభివృద్ధి పథకాలు చేపట్టారు.
ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ మార్గ్ లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో “హైదరాబాద్ రైజింగ్” ఉత్సవాలు వైభవంగా జరిగాయి.నగరాన్ని ఆరు కాన్సెప్ట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
- బ్లూయెస్ట్ సిటీలో భాగంగా మూసీ పునరుద్ధరణ, హైడ్రా చెరువుల పరిరక్షణ, నాలాల పునరుద్ధరణ, గోదావరి నుంచి మంచినీటి సరఫరా పథకాలు చేపట్టారు.ఫాస్టెస్ట్ సిటీలో భాగంగా ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు, నో సిగ్నల్ జంక్షన్స్,మెట్రోరైలు విస్తరణ, అర్బన్ రింగ్ రైలు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు.
- గ్రీనెస్ట్ సిటీ ఈవీ పాలసీ, ఈవీ ఆర్టీసీ ఫ్లీట్, అర్బన్ ఫారెస్ట్రీ, కేబుల్ కార్ షటిల్స్,సేఫేస్ట్ సిటీ డ్రోన్ పోలిసింగ్, డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్, మహిళలు, బాలల భద్రతకు ప్రాధాన్యమిచ్చారు. ఫ్యూచర్ సిటీ ఏఐ సిటీ, రికార్డు స్థాయిలో పెట్టుబడులు, ఫోర్త్ సిటీ, ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించారు.ఆపర్చునిటీ సిటీ అధికంగా ఉపాధి అవకాశాలు, స్టార్టప్ హబ్స్, వ్యాపార ప్రారంభానికి సులభంగా అవకాశాలు, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
హైడ్రాకు రూ.50 కోట్ల నిధులు
చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా రూ.50కోట్ల నిధులు విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైడ్రా కార్యాలయ నిర్వహణ, వాహనాల కొనుగోలు నిమిత్తం నిధులు విడుదల కేటాయించింది.
అభివృద్ధి పనులకు శ్రీకారం
ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారు ఈ నెల 3వ తేదీన హై సిటీ ప్రాజెక్ట్ లకు శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.3,666.50 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించారు.హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ చేపట్టారు.హైసిటీ ప్రాజెక్ట్ కింద రోడ్ల నిర్మాణ పనులు రూ.3,500 కోట్లు,12 రెయిన్ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్లు 12 నిర్మాణం కోసం రూ. 16.50 కోట్లు,283 సుందరీకరణ పనులు రూ. 150 కోట్లు కేటాయించారు.
రూ.5827 కోట్లతో అభివృద్ధి పనులు
ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవెలప్మెంట్ విభాగం పరిధిలో రూ.5827 కోట్ల తో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.రహదారులు, జంక్షన్ల సుందరీకరణకు రూ.150 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు.సిటీలో వరదనీరు నిలవకుండా వర్షపు నీటి సంరక్షణ, వరద నీటిని నియంత్రించే పనులకు రూ.17 కోట్ల అంచనాలతో చేపట్టే పనులను ప్రారంభించారు.తాగునీటి సరఫరాకు అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ వివిధ ప్రాంతాల్లో రూ.45 కోట్లతో చేపట్టిన 19 రిజర్వాయర్లను సీఎం ప్రారంభించారు.హైదరాబాద్ రోడ్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అధ్వర్యంలో గ్రేటర్ సిటీలో రూ.1500 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేసే పనులకు శంకుస్థాపన చేశారు.
Next Story