
రెయిన్ వాటర్ సంపును పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad|ఇక ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం,రెయిన్ వాటర్ సంపులు
హైదరాబాద్ లో ఇక ట్రాఫిక్ సమస్యలు శాశ్వతంగా తీరనున్నాయి.నగరంలోని 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద రెయిన్ వాటర్ సంపుల నిర్మాణం చేపడుతున్నారు.
హైదరాబాద్ నగరంలో చినుకు పడితే చాలు 141 పాయింట్లలో రోడ్లు నదులుగా మారుతున్నాయి. వరదనీటి ప్రవాహంతో నగరంలో పలు చోట్ల వాహనాల రాకపోకలక తీవ్ర అంతరాయం వాటిల్లుతోంది. ప్రధాన రోడ్లే నదులను తలపిస్తుండటంతో దీనికి రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారాన్ని కనుగొంది. వర్షపునీటిని సంపుల్లోకి పంపించడం ద్వారా రోడ్లపై వరదనీరు నిలువకుండా రాష్ట్ర మున్సిపల్ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
వచ్చే వర్షాకాలం నాటికి రెయిన్ వాటర్ సంపుల నిర్మాణం పూర్తి
హైదరాబాద్ నగరంలో పలు ప్రధాన రోడ్లపై 141 ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ పాయింట్స్ ను మున్సిపల్ అధికారులు గుర్తించారు. ఆయా పాయింట్లలో వాటర్ సంపులు నిర్మించి పైన ఇనుప జాలీలను ఏర్పాటు చేస్తున్నారు. నగరంలోని గవర్నర్ బంగాళ రాజ్ భవన్ రోడ్డుపై లేక్ వ్యూ గెస్ట్ హౌస్ దగ్గర వరద నివారణ కోసం నిర్మిస్తున్న రెయిన్ వాటర్ సంప్ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం పరిశీలించారు. రోడ్లపై వరద నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. వచ్చే వర్షాకాలం నాటికి అన్నీవాటర్ లాగింగ్ పాయింట్లలో సంపుల నిర్మాణ పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
అధికారులకు సీఎం సూచనలు
భారీ వర్షాలు, వరదలు చిన్నపాటి వరదొచ్చినా నగరంలో చాలాచోట్ల రోడ్లు జలమమమై ట్రాఫిక్‌తో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.ఈ ఇబ్బందులను గుర్తించి, 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద వెంటవెంటనే నీరు వెళ్లేలా శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో అధికారులను ఆదేశించారు.ఆ పనుల పురోగతిని సీఎం స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వచ్చే వర్షాకాలం నాటికి అన్ని చోట్లా పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రెయిన్ వాటర్ సంప్‌ల డిజైన్‌లో అవసరమైన మార్పులను అధికారులకు సూచించారు.
ట్రాఫిక్ జాంలను తగ్గించవచ్చు...
రోడ్ల పైన వరదనీటిని సంపుల్లోకి మళ్లిస్తే నగరం లో ట్రాఫిక్ జాం లను తగ్గించవచ్చని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.రెయిన్ వాటర్ సంప్ ల డిజైన్ మార్చాలని సీఎం అధికారులకు సూచించారు.హైదరాబాద్ వ్యాప్తంగా గుర్తించిన 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర రెయిన్ వాటర్ సంపు లను నిర్మించాలని ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇళంబర్తి,సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డిలతో సీఎం సమీక్షించారు.
Next Story