హైదరాబాద్ గాజులకు అందాల భామల ఫిదా
x
లాడ్ బజార్ లో అందాల భామల సందడి

హైదరాబాద్ గాజులకు అందాల భామల ఫిదా

చార్మినార్ చెంత మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాల కాంతుల మధ్య ప్రపంచ సుందరీమణులు మెరిశారు.లాడ్ బజార్ లో గాజులు చూసిన ముద్దుగుమ్మలు వాటిని వేసుకొని మురిసిపోయారు.


చార్మినార్ చెంత ఉన్న లాడ్ బజార్ లో హైదరాబాద్ గాజులను చూసిన ప్రపంచ అందకత్తెలు వాటిని కొనుగోలు చేసి చేతులకు తొడుక్కున్నారు. 109 దేశాల ముద్దుగుమ్మలు లాడ్ బజార్ లో నృత్యం చేస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. లాడ్ బజార్ లో గాజుల దుకాణాల్లో పలు రకాల గాజులను అందాల భామలు కొనుగోలు చేశారు. చార్మినార్ నుంచి లాడ్ బజార్ లో అందాల భామలు వాక్ చేశారు.





అనంతరం చౌమహల్లా ప్యాలెస్ కు చేరుకున్నారు. నిజాం వంశస్థుల రాజ సింహాసనం, వారు వాడిన వస్తువులు, సైనిక సామాగ్రి, వంట సామాగ్రిని అందాలభామలు ఆసక్తిగా గమనించారు. పాతబస్తీ సంస్కృతి, సాంప్రదాయాలు తెలిపే న్యత్య రీతులతో మహిళలు స్వాగతం పలికారు.



ప్రపంచ దేశాల అందాల భామలను హైదరాబాద్ ముత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పలువురు భామలు ముత్యాల హారాలు, గాజులను కొనుగోలు చేశారు. ముత్యాలు, గాజులను ఆసక్తికరంగా పరిశీలిస్తూ వాటి వివరాలు తెలుసుకుంటూ కొనుగోలు చేశారు. స్థానిక వ్యాపారులతో ముచ్చటించి వారు అమ్మే వస్తువుల వివరాలు తెలుసుకున్నారు.




అందాల భామలకు రాష్ట్ర ప్రభుత్వం విందు

మిరుమిట్లు గొలుపుతున్న విద్యుత్ దీపాల కాంతుల్లో మంద్రమైన సంగీతం మధ్య అందాల భామలకు చౌమహల్లా ప్యాలెస్ స్వాగతం పలికింది.గౌరవ అతిథులకు నిజాం శకం గుర్తు చేస్తూ షెహనాయ్, నౌబత్ యొక్క సాంప్రదాయ స్వరాలతో స్వాగతం పలికారు.ఈ ప్యాలెస్ ప్రపంచ అందం, సంస్కృతి,సంప్రదాయాన్ని చూసిన అందాలభామలు ఆనందం వ్యక్తం చేశారు.



మిస్ వరల్డ్ పోటీదారులను రాజ వైభవంలో స్వాగతించారు. చార్మినార్ వద్ద మిస్ వరల్డ్ కార్యక్రమం ముగిసింది. చౌమల్లా ప్యాలెస్ లో వేడుకలు ప్రారంభం అయ్యాయి.ప్రభుత్వ ఆధ్వర్యంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు విందు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.




అందాలభామల ఫోటోషూట్

చార్మినార్ వద్ద అందాలభామలు ప్రత్యేకంగా ఫోటోషూట్ కు హాజరయ్యారు.చార్మినార్ వేదిక నుంచి ప్రజలకు అందగత్తెలు అభివాదం చేశారు.చరవాణుల్లో చార్మినార్ అందాలను బంధించారు.గాజుల తయారీని స్వయంగా పరిశీలించిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్ లు తయారీ దారులను ప్రశంసించారు. ఐదు శతాబ్దాలుగా హైదరాబాద్ మధ్యన ఠీవిగా నిలబడి ఉన్న ఈ సొగసైన కట్టడాన్ని చూసి సుందరాంగులు మంత్రముగ్ధులయ్యారు.



లాడ్ బజార్ వ్యాపారుల ఉదారత

లాడ్ బజార్ వ్యాపారులు ఉదారత చూపించారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల దగ్గర వ్యాపారులు డబ్బులు తీసుకోలేదు. మిస్ వరల్డ్ పోటీదారులు కొనుగోలు చేసిన వస్తువులను ఉచితంగానే అందజేశారు. హైదరాబాద్ విశిష్ఠతను చార్మినార్ లాడ్ బజార్ ప్రత్యేకతలను ప్రపంచవ్యాప్తంగా తమ దేశాల్లో చాటాలని మిస్ వరల్డ్ కంటెస్టెంట్లను వ్యాపారులు కోరారు. మిస్ వరల్డ్ ప్రతినిధులకు తమ షాపుల్లోకి గులాబీ పూలు ఇచ్చి ఆహ్వానించారు.


Read More
Next Story