AV Ranganath
x

'అక్రమ' అధికారులపై చర్యలు... రంగనాథ్ క్లారిటీ

హైడ్రా మరొక సంచల నిర్ణయం తీసుకుంది. అక్రమంగా కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై కొరడా ఝులిపించేందుకు సిద్ధమైంది.


హైడ్రా మరొక సంచల నిర్ణయం తీసుకుంది. అక్రమంగా కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై కొరడా ఝులిపించేందుకు సిద్ధమైంది. అధికారులపై క్రిమినల్ చర్యలకు కూడా సిద్ధమవుతోంది హైడ్రా. చెరువుల్లో కట్టడాలకి అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ కమిషనర్ కి సిఫారసు చేసింది. దీంతో గండిపేట్, మాదాపూర్ పరిసరాలలో అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలకు యాక్షన్ ప్లాన్ సిద్ధమవుతోంది.

కాగా, ఆరుగురు అధికారులపై క్రిమినల్ చర్యలకు హైడ్రా సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో ఎఫ్టీఎల్ లో కట్టడాలకు అనుమతులు ఇచ్చి చేతులు దులుపుకున్న అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు కానున్నాయి. ఇక హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం సాయంత్రం అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సైతం పాల్గొన్నారు. ఇకపై హైడ్రా ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలనే అంశం పైనా ఈ భేటీలో చర్చించారు. హైడ్రా కి వ్యతిరేకంగా కొందరు నేతలు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో ఏం చేయాలని ఆలోచించిన తెలంగాణ సర్కార్ హైడ్రాకి చట్టబద్ధత కల్పించాలని నిర్ణయం తీసుకుంది.

రంగనాథ్ ఏమన్నారంటే..?

చెరువులతో పాటు హైడ్రా పరిధిలోని ప్రాంతాలలో అక్రమ నిర్మాణాలకు అనుమతినిచ్చిన వారిపై చట్టబద్దంగా చర్యలు తీసుకుంటున్నామన్న వార్తను హైడ్రా ఛీఫ్ ఏవీ రంగనాథ్ దృవీకరించారు. "ఈ అధికారులను గుర్తించి ప్రాసిక్యూట్ చేయడం జరగుతుంది," అని ఆయన ఫెడరల్ కు చెప్పారు.

Read More
Next Story