నోటీసులుండవ్.. డైరెక్ట్ కూల్చివేతలే.. -రంగనాథ్
x

నోటీసులుండవ్.. డైరెక్ట్ కూల్చివేతలే.. -రంగనాథ్

హైడ్రా ప్రకంపనలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారాయి. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని జగన్ ఇంటికి హైడ్రా నోటీసులు ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది.


హైదారాబాద్ పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం హైడ్రా ని ఏర్పాటు చేసింది. హైడ్రా అమలులోకి వచ్చినప్పటి నుంచి దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఎఫ్టిఎల్, బఫర్ జోన్ లో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను నేలమట్టం చేస్తుంది. ఈ క్రమంలో పలువురు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖుల నిర్మాణాలను సైతం కూల్చివేసింది.

ఈ క్రమంలో ఓన్లీ బీఆర్ఎస్ నేతల్ని టార్గెట్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కుట్రకు తెరలేపారని గులాబీ శ్రేణులు విమర్శలు ఎక్కుపెట్టాయి. మా పార్టీ నేతలను బెదిరించి కాంగ్రెస్ లో చేర్చుకోవాలనే దురుద్దేశంతో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారంటూ దుయ్యబడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో హైడ్రా వ్యవహారం రాజకీయ దుమారానికి దారితీసింది.

హైడ్రా ప్రకంపనలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారాయి. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంటికి హైడ్రా నోటీసులు ఇచ్చిందని గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. లోటస్ పాండ్ లోని జగన్ ఇల్లు ఎఫ్డిఎల్ పరిధిలో ఉందని, హైడ్రాధికారులు కూల్చేస్తారని కథనాలు వెల్లువెత్తాయి. దీంతో ఈ విషయం ఏపీలోనూ చర్చనీయాంశమైంది.

అయితే, ఈ ప్రచారాన్ని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఖండించారు. వైఎస్ జగన్ కి హైడ్రా నోటీసులు ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని, వాటిని ఎవరూ నమ్మొద్దని సూచించారు. హైడ్రో ఇలాంటి నోటీసులు ఇవ్వదని, ఆక్రమణ అని నిర్ధారించుకుంటే నేరుగా వెళ్లి కూల్చేస్తుందని మరోసారి స్పష్టం చేశారు. దీంతో జగన్ కి హైడ్రా నోటీసులు ఇచ్చిందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి బ్రేక్ పడింది.

Read More
Next Story