ఎన్ కన్వెన్షన్ను కూల్చేసిన హైడ్రా..నాగార్జునకు ఊహించని షాక్
x
N convention center demolished

ఎన్ కన్వెన్షన్ను కూల్చేసిన హైడ్రా..నాగార్జునకు ఊహించని షాక్

హైడ్రా అనుకున్నంత పనీచేసింది. శనివారం ఉదయం సినీ ప్రముఖుడు, హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చేసింది.


హైడ్రా అనుకున్నంత పనీచేసింది. శనివారం ఉదయం సినీ ప్రముఖుడు, హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చేసింది. ఎన్ కన్వెన్షన్ సెంటర్ మీద చాలా సంవత్సరాలుగా ఆరోపణలున్నాయి. మాదాపూర్లోని తుమ్మడికుంట చెరువును ఆక్రమించి నాగార్జున కమర్షియల్ కాంప్లెక్సును నిర్మించారనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. అయితే కన్వెన్షన్ సెంటర్ పై ఎన్ని ఆరోపణలు వచ్చినా నాగార్జున పట్టించుకోలేదు. దివంగగ ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో ఒకసారి సర్వే జరిగింది. ఆ సర్వేలో నాగార్జున చెరువులో కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారని నిర్ధారణయ్యింది. అయినా దాన్ని కూల్చేయటానికి అధికారులు వెనకాడారు.

సీన్ కట్ చేస్తే కొద్దిరోజులుగా చెరువులు, కుంటలను ఆక్రమించి అక్రమంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా కూల్చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే జనంకోసం అనే సంస్ధ నిర్వాహకుడు భాస్కరరెడ్డి హైడ్రాకు కన్వెన్షన్ సెంటర్ పై ఫిర్యాదుచేశారు. ఆ పిర్యాదును విచారించిన హైడ్రా భాస్కరరెడ్డి ఆరోపణలు నిజమే అని నిర్ధారణ చేసుకున్నారు. గతంలో ఈ సెంటర్ను కూల్చేయాలని లోకాయుక్తా ఆదేశించినా అధికారులు పట్టించుకోలేదు. అలాంటిది ఇపుడు హైడ్రా కూల్చివేతల నేపధ్యంలో ప్రముఖల అక్రమ నిర్మాణాలను కూడా కూల్చేయాలనే డిమాండ్లు పెరిగిపోతున్నాయి.

దాంతో హైడ్రా శనివారం ఉదయం నుండి ఆరు బుల్డోజర్లు, భారీ పొక్లైనర్లతో కన్వెన్షన్ సెంటర్ను కూల్సేసింది. చెరువులోని మూడున్నర ఎకరాలను నాగార్జున ఆక్రమించేసి భారీ నిర్మాణం చేశారు. ఇపుడు సెంటర్ను కూల్చేశారు బాగానే ఉంది కాని మరి ఇన్ని సంవత్సరాలుగా నాగార్జున సంపాదించిన ఆదాయం మాటేమిటనే నిలదీతలు పెరిగిపోతున్నాయి. మొత్తానికి నోటీసులు ఇవ్వకుండానే కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా కూల్చేసింది. తాజా సంఘటనతో ఇప్పటికి 160 నిర్మాణాలను కూల్చేసి సుమారు 165 ఎకరాలను హైడ్రా స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి అప్పగించినట్లయ్యింది.

Read More
Next Story