
కూకట్ పల్లిలో హైడ్రా కూల్చివేతలు షురూ
ఆక్రమణదారుల నుంచి తీవ్ర ప్రతిఘటన
కూకట్ పల్లిలో హైడ్రా కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం నుంచి హైడ్రా బుల్డోజర్లు అక్రమ కట్టడాల వైపు దూసుకెళ్లాయి. కూకట్ పల్లి హబీబ్ నగర్ లో అక్రమ కట్టడాలు ఉన్నాయని హైడ్రాకు సమాచారం అందింది. ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలు వెలిసాయని హైడ్రా అధికారులు చెబుతున్నారు. ఆక్రమణ దారులకు నోటీసులు ఇచ్చారు. ఆక్రమణదారులు కట్టుకున్న ఇళ్ల గోడలకు హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చారు. మార్కింగ్ కూడా చేశారు. బాలాజీ నగర్ లో పెద్ద నాలాను ఆక్రమణ దారులు ఆక్రమించేశారని ఫిర్యాదు అందిన వెంటనే హైడ్రా కమీషనర్ రంగనాథ్ చర్యలకు ఉపక్రమించారు.
ఆక్రమణదారుల నుంచి ప్రతిఘటన వచ్చే అవకాశం ఉండటంతో భారీ పోలీసుబందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో ఆక్రమణదారుల నుంచి ప్రతిఘటన వస్తోంది. అయినా అధికారులు అక్రమ కట్టడాలపై ఉక్కు పాదం మోపారు.
ఓవైసీ కుటుంబానికి చెందిన ఫాతిమా కాలేజీ పూర్తిగా చెరువులో ఉన్నప్పటికీ హైడ్రా ఆ కట్టడాల జోలికి వెళ్లడం లేదు. హైడ్రా ఏర్పాటు అయిన తొలినాళ్లలో చెరువుల పరిరక్షణే ధ్యేయంగా రాజకీయాల కతీతంగా నోటీసులు ఇచ్చిన కట్టడాల్లో ఫాతిమా కాలేజి ఒకటి. కాంగ్రెస్ తో ఓవైసీ దోస్తానా పెరిగిపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఫాతిమా కాలేజి జోలికి వెళ్లడం లేదని కమిషనర్ రంగనాథ్ చెబుతున్నారు. రంగనాథ్ ప్రకటన ప్రతిపక్షాలకు అస్త్రంగా మారాయి.