హైడ్రా అధికారాలను ప్రశ్నించే అవకాశంలేదు
x
Ordinance issued in favor of Hydra

హైడ్రా అధికారాలను ప్రశ్నించే అవకాశంలేదు

ఇలాంటి ప్రశ్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం గట్టి సమాధానమిచ్చింది. హైడ్రాకు చట్టబద్దమైన అధికారాలను కల్పించిన ఆర్డినెన్సుపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు.

హైడ్రాకు ఏమి అధికారాలున్నయని కూల్చేస్తోంది ?

ఆక్రమణలను కూల్చటానికి హైడ్రా ఎవరు ?

ఇలాంటి ప్రశ్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం గట్టి సమాధానమిచ్చింది. హైడ్రాకు చట్టబద్దమైన అధికారాలను కల్పించిన ఆర్డినెన్సుపై రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. అంటే హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తు ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్సుకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. ఇపుడు జారీ అయిన ఆర్డినెన్సును తొందరలోనే జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి సభ ఆమోదం తీసుకుని నూరుశాతం చట్టంగా మార్చబోతోంది రేవంత్ రెడ్డి సర్కార్. కాబట్టి హైడ్రా అధికారాలను, చట్టబద్దతను ప్రశ్నించే వాళ్ళ నోళ్ళను ప్రభుత్వం మూయించేసింది.

తాజాగా జారీ అయిన ఆర్డినెన్స్ ప్రకారం హైడ్రాకు చాలా అధికారాలు దఖలుపడ్డాయి. ఆ అధికారాలు ఏమిటంటే ఆక్రమణలను పరిశీలించటం, నోటీసులు ఇవ్వటం, ప్రభుత్వ స్ధలాల్లోని ఆక్రమణల తొలగింపు అధికారం కల్పించే జీహెచ్ఎంసీ చట్టం-1955లోని సెక్షన్ 374బీని ఆర్డినెన్సులో చేర్చారు. తెలంగాణా మున్సిపల్ చట్టం-2019 ప్రకారం సంబంధిత కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్లకు ఉన్న అధికారాలను, తెలంగాణా బీపాస్ చట్టం-2020 ప్రకారం జోనల్ కమీషనర్ నేతృత్వంలోని జోన్ టాస్క్ ఫోర్స్, జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా టాస్క్ ఫోర్స్ కు ఉన్న అన్నీ అధికారాలు హైడ్రాకు వచ్చాయి.

హెచ్ఎండీఏచట్ట-2008లోని పలు సెక్షన్ల కింద కమీషనర్ కు ఉన్న అధికారం, తెలంగాణా భూ ఆదాయ చట్టంలోని సెక్షన్ 1317 ఎఫ్ ప్రకారం అక్రమణల తొలగింపు, ఆస్తుల పరిరక్షణకు సంబంధించి ఆర్డీవో, జిల్లా కలెక్టర్ కు ఉన్న అధికారాలు, ఇవే అంశాలకు సంబంధించి తెలంగాణా నీటిపారుదల చట్టంలోని అధికారాలు, జీవో ఎంఎస్-67 ద్వారా 2002లో యూడీఏ/ ఎగ్జిక్యూటివ్ అధికారికి ఉన్న అన్నీ అధికారాలను హైడ్రాకు సంక్రమించాయి.

తెలంగాణా భూ ఆక్రమణ చట్టం-1905లోని పలు సెక్షన్ల కింద జిల్ల కలెక్టర్, ఎంఆర్వో, డిప్యుటి తహశిల్దార్ కి ఉన్న అన్నీ అధికారాలు, వాల్టా చట్టం-2002, తెలంగాణా బిల్డింగ్ రూల్స్, తెలంగాణా ఫైర్ సర్వీసెస్ చట్టంలోని పలు అధికారాలను కూడా హైడ్రాకు కట్టబెట్టారు. రెవిన్యు, స్ధానిక సంస్ధలు, ఇతర ప్రభుత్వ శాఖల ద్వారా ఆక్రమణలదారులకు నోటీసులు ఇప్పించటం, అనంతరం ఆయా నిర్మాణాలపై చర్యలు తీసుకోవటంలో తలెత్తుతున్న జాప్యానికి అవకాశం లేకుండా, హైడ్రా కొత్త అధికారాలతో స్వయంగా అవసరమైన చర్యలను సకాలంలో తీసుకునేందుకు ఆర్డినెన్సు అన్నీ అధికారాలను కల్పించింది.

Read More
Next Story