రోడ్ల ఆక్రమణలపై హైడ్రా కొరడా,మళ్లీ ఇళ్ల కూల్చివేతలు షురూ
x

రోడ్ల ఆక్రమణలపై హైడ్రా కొరడా,మళ్లీ ఇళ్ల కూల్చివేతలు షురూ

రోడ్లను ఆక్రమించి నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేసేందుకు హైడ్రా దృష్టి సారించింది. రోడ్లను కబ్జా చేసి ఇళ్లు నిర్మించారని వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా స్పందిస్తోంది.


కొంతకాలంగా బెంగళూరులో చెరువుల పరిరక్షణ అధ్యయనానికే పరిమితమైన హైడ్రా మళ్లీ రోడ్డు స్థలాలను ఆక్రమించి నిర్మించిన ఇళ్లను కూల్చివేస్తోంది. ప్రజలు నడిచే రోడ్లను కబ్జా చేసి ఇళ్లు నిర్మించుకోవడాన్ని హైడ్రా తీవ్రంగా పరిగణించి కూల్చివేతలు చేపట్టింది.

- అమీన్ పూర్ వందనపురి కాలనీలోని 848 సర్వేనంబరులో రోడ్డు స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన భవనాన్ని హైడ్రా బుల్డోజర్లు సోమవారం కూల్చివేశాయి. రెండు ఇళ్లను భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేశారు.
- ఇటీవల నాగారం మున్సిపాలిటీలోనూ రోడ్డును ఆక్రమించి నిర్మించిన రెండు ఇళ్లను హైడ్రా అధికారులు తొలగించారు. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని ఈస్ట్ హనుమాన్ నగర్ లో రోడ్డును ఆక్రమించి కట్టిన ఇంటిని హైడ్రా కూల్చివేసింది. దీంతో రోడ్డు కబ్జా చెర వీడినట్లయింది.


హైడ్రా ఆక్రమణల తొలగింపు

హైడ్రా జులై 19వతేదీన ఏర్పాటు చేశాక ఇప్పటివరకు 300కు పైగా ఆక్రమణలను తొలగించింది. చెరువులు, కుంటలు, నాలాలు, రోడ్లు, పార్కు స్థలాలను కబ్జా చేసి నిర్మించిన భవనాలపై హైడ్రా దృష్టి సారించింది. గత 100 రోజుల్లో 120 ఎకరాలను సర్కారుకు అప్పగించింది.



ఎర్రకుంటకు పునరుజ్జీవం
తార్నాక ప్రాంతంలోని ఎర్రకుంటను పునరుద్ధరించేందుకు హైడ్రా ముందుకు వచ్చింది. 5.9 ఎకరాల్లో విస్తరించిన ఎర్రకుంట వల్ల తమ ప్రాంతంలో దోమల బెడద పెరిగిందని నాగార్జున కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. దీంతో ఎర్రకుంటను అభివృద్ధి చేయాలని హైడ్రా కమిషనర్ నిర్ణయించారు.

బతుకమ్మకుంటకు హైడ్రా జీవం
అంబర్ పేటలోని బతుకమ్మకుంట చెరువును పునరుద్ధరించడానికి హైడ్రా చేపట్టిన చర్యలతో వీకర్ సెక్షన్ కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఇళ్లను కూల్చివేయకుండా బతుకమ్మ కుంటను పునరుద్ధరించాలని హైడ్రా తీసుకున్న నిర్ణయాన్ని స్థానికులు స్వాగతించారు. బతుకమ్మకుంటను 5.15 ఎకరాల్లో పునరుద్ధరిస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు.





Read More
Next Story