
4,500 కోట్ల రూపాయల విలువ చేసే భూములను కాపాడిన హైడ్రా
100 ఎకరాల్లో అక్రమ కట్టడాల కూల్చివేత
వేలాది కోట్ల రూపాయల విలువ చేసే భూములను హైడ్రా పరిరక్షించింది. గాజుల రామారంలో దాదాపు 4, 500 కోట్ల రూపాయల విలువ చేసే భూములను కబ్జాదారుల చెర నుంచి విడి పించింది. దాదాపు 100 ఎకరాలను కబ్జారాయుళ్లు ఆక్రమించి ప్లాట్లుగా విభజించి విక్రయిస్తున్నట్టు హైడ్రాకు సమాచారమందింది. 60 నుంచి 70 గజాల ప్లాట్లను విక్రయించడంతో కబ్జారాయుళ్లు విక్రయిస్తున్నారు. ఒక్కో ప్లాటు విలువ పది లక్షల రూపాయల వరకు ఉంటుంది. సర్వే నెంబర్ 397లో అక్రమణ దారుల కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. తామంతా డబ్బులు పెట్టుకుని కొనుగోలు చేసిన భూములను కూల్చివేయడం తగదని స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. జెసీబీ వాహనాలకు అడ్డు తగిలారు . చిన్న పిల్లలతో జేసీబీ వాహనాల ముందు బైఠాయించారు. గాజుల రామారం 300 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా దాదాపు 100 ఎకరాలను కబ్జారాయుళ్లు ఆక్రమించారు. మిగిలిన 200 ఎకరాలు సురక్షితంగా ఉండటంతో హైడ్రా ఫెన్సిగ్ పనులు చేపట్టింది. ఆక్రమణదారులను తొలగించి 100 ఎకరాలకు ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని హైడ్రా అధికారులు తెలిపారు. 300 ఎకరాల ప్రభుత్వ భూమి మార్కెట్ రేటు ప్రకారం 15,000 కోట్ల రూపాయలు ఉంటుందని హైడ్రా అధికారులు అంచనా వేశారు.
హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌కు కేవలం 10 కి.మీ. దూరంలో ఉన్న గాజులరామారంలోని వందల ఎకరాల ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు జరిగాయి. పక్కా భవనాలు వెలిశాయి. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, టీజీఐఐసీ, హెచ్‌ఎండీఏ, హౌసింగ్‌బోర్డు విభాగాలకు దశాబ్దాల క్రితం అప్పటి పాలకులు భూములిచ్చినప్పటికీ ఎటువంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో . ఆయా విభాగాలు తమ కార్యకలాపాలు ప్రారంభించకపోవడంతో కొందరు అక్రమార్కులు భూములను కబ్జా చేస్తున్నారు.
పేదల జోలికి వెళ్లడం లేదు: రంగనాథ్
గాజుల రామారంలో ఆక్రమ కట్టడాలను కూల్చి వేస్తున్నట్టు హైడ్రాకమిషనర్ రంగనాథ్ చెప్పారు. 40 ఎకరాల ప్రభుత్వ భూముల్లో పేదలు ఇళ్లు నిర్మించుకున్నారని, స్థానిక రాజకీయ నేతలు, అధికారులు కుమ్ముక్కై ఆక్రమణలు చేసి పేదలకు విక్రయించినట్టు హైడ్రా కమిషనర్ చెప్పారు. పేదల ఇళ్ల జోలికి వెళ్లడం లేదని కమిషనర్ స్పష్టం చేశారు. వాణిజ్య షెడ్ల, కంపౌడ్ గోడలు, గదులు నిర్మించిన వారిపై హైడ్రా కూల్చేస్తుందని ఆయన తెలిపారు.13వేల కోట్ల విలువైన 275 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటామని రంగనాథ్ చెప్పారు. ఆరు నెలల్లో ఐదుసార్లు స్థానికులతో హైడ్రా , రెవిన్యూ అధికారులు చర్చించారని ఆయన చెప్పారు.