వైసీపీ నేతకు హైడ్రా షాక్
x
Silpa Mohan Reddy with Jagan

వైసీపీ నేతకు హైడ్రా షాక్

ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోనే నిర్మాణాలు జరుగుతున్నాయని తేల్చుకుని వాటిని కూల్చేస్తున్నారు.


గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రియల్ ఎస్టేట్ చేస్తున్న వైసీపీ నేతలకు కూడా హైడ్రా పెద్ద షాకే ఇచ్చింది. వైసీపీ నేత, మాజీమంత్రి శిల్పా మోహన్ రెడ్డి చాలా సంవత్సరాలుగా గ్రేటర్ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. శిల్పా పేరుతో భారీ వెంచర్లు వేయటమే కాకుండా పెద్ద బిల్డర్ కూడా. దశాబ్దాలుగా శిల్పా మోహన్ రెడ్డి హైదరాబాద్ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇపుడు విషయం ఏమిటంటే సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలం నాగ్సాన్పల్లిలోని నల్లవాగు ప్రాంతాన్ని శిల్పా కంపెనీ కబ్జా చేసి నిర్మాణాలు చేస్తోందనే ఆరోపణలు హైడ్రాకు చేరాయి. వచ్చిన ఆరోపణలను హైడ్రా అధికారులు ఒకటికి రెండుసార్లు చెక్ చేశారు. నల్లవాగును శిల్పా కంపెనీ కబ్జాచేసి నిర్మాణాలు చేస్తున్నట్లు నిర్ధారించుకున్నారు. తాజాగా అధికారులు సర్వే చేసి చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోనే నిర్మాణాలు జరుగుతున్నాయని తేల్చుకుని వాటిని కూల్చేస్తున్నారు.

మోహన్ రెడ్డికి ఏపీతో పాటు తెలంగాణాలో కూడా చాలా వ్యాపారాలున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో శిల్పా బాగా ప్రముఖడనే చెప్పాలి. అలాంటి శిల్పా గ్రేటర్ పరిధిలో రియల్ ఎస్టేట్ చేస్తున్నపుడు ప్రస్తుతం హైడ్రా వ్యవహరాలను చూసుకోవాలి. కాని ఇపుడు చేస్తున్న నిర్మాణాలు హైడ్రా ఏర్పాటుకాకముందే మొదలయ్యాయి. హైడ్రా దూకుడు చూసిన తర్వాత అయినా జాగ్రత్తపడుండాలి. అయితే తనకు ముఖ్యమంత్రి బాగా సన్నిహితుడు అన్న ఉద్దేశ్యంతో కబ్జాలో అక్రమనిర్మాణాలను కంటిన్యు చేసినట్లున్నారు. ఇపుడు హైడ్రా దూకుడు, వ్యవహారాలన్నీ బాగా వివాదాస్పదమైపోతున్నాయి. హైడ్రా ఉన్నది పేదల ఇళ్ళను కూల్చుతు పెద్దలను రక్షించటానికే అనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. హైడ్రా దెబ్బకు ఇళ్ళు కోల్పోయిన బాధితుల్లో చాలామంది హైడ్రాను రేవంత్ రెడ్డిని కలిపి శాపనార్ధాలు పెడుతున్నారు.

ఈ నేపధ్యంలోనే ఇపుడు గ్రేటర్ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్న ఏపీ సంస్ధల పైన హైడ్రా కన్నుపడింది. ఇందులో భాగంగానే ఇపుడు శిల్పా మోహన్ రెడ్డి చేస్తున్న నిర్మాణాలను కూల్చేస్తోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నిర్మాణాలను కూల్చేయటం వల్ల శిల్పాకు జరిగే నష్టాలు ఏమీలేవు. ఎందుకంటే కొనుగోలుదారుల నుండి, బ్యాంకులు, ఆర్ధికసంస్ధల నుండి శిల్పా తనకు రావాల్సిన డబ్బును ఎప్పుడో రాబట్టేసుకునుంటారు. ఇపుడు నిర్మాణాలను కూల్చేయటం వల్ల దెబ్బతినేది కొనుగోలుదారులు, లోన్లు ఇచ్చిన బ్యాంకులు, ఆర్ధికసంస్ధలే. నిర్మాణాలను కూల్చేసిన కారణంగా తాను కూడా నష్టపోయినట్లు శిల్పా బిల్డప్ ఇస్తారు. దాంతో లోన్ల రికవరీ కోసం బ్యాంకులు, ఆర్ధికసంస్ధలు, ఏ అవసరం కోసమైతే లోన్ తీసుకున్నామో అది మధ్యలోనే కూలిపోయిన కారణంగా లోన్ కట్టడానికి కొనుగోలుదారులు అడ్డం తిరుగుతారు. దాంతో ఇపుడు బ్యాంకులు, ఆర్ధికసంస్ధలు-కొనుగోలుదారులు జుట్లు పట్టుకోవాలి.

Read More
Next Story