సిటిలో 25 వేల మందికి దారి చూపిన ‘హైడ్రా’
x

సిటిలో 25 వేల మందికి 'దారి' చూపిన ‘హైడ్రా’

అడ్డుగోడను కూల్చి ప్రజలను ఆదుకున్న హైడ్రా


హైదరాబాద్: హైదరాబాద్‌లో గత దశాబ్ద కాలంగా కాలనీలు (గేటెడ్ కమ్యూనిటీలు కాదు) కాంపౌండ్ గోడలు గేట్లను నిర్మించి ఇతర కాలనీల వాసులకు దారుల్లేకుండా చేస్తున్నారు.చాలా చోట్ల ఇలాంటి గోడలన్నీ కూడా అప్రూవ్డ్ లే అవుట్ నుంచి డీవియేట్ అని కట్టినవి. ఈ గేటెడ్ కమ్యూనిటీలు బాగా డబ్బులున్నవి, వీటి ప్రమోటర్లు కూడా పలుకుబడి ఉన్న రియల్టర్ లు కాబట్టి అక్రమంగా అడ్డుగోడలను, ఎంక్రోచ్ మెంట్లను తొలగించడం సామాన్యమానవులకు సాధ్యం కాదు. గేటెడ్ కమ్యూనిటీలు గెట్ లు మూసుకునేందుకు క్ కట్టిన కాంపౌండ్ గోడల వల్ల పరిసరాల కాలనీ ప్రజలు గతంలో ఉపయోగించిన మార్గాలలో ప్రయాణించలేకపోతున్నారు. ఇలాంటి కమ్యూనిటీల వల్ల ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని హైడ్రా (Hyderabad Disaster Response Assets Monitoring and Protection Agency (HYDRAA)ను ఆశ్రయిస్తున్నారు. జూలై 7న హైడ్రా సికిందరాబాద్ లో జరిపిన ప్రజావాణిలో పార్క్ లను రోడ్లను అక్రమించుకున్న వారి మీద ఫిర్యాదులే ఎక్కువగా ఉన్నాయి.

ఇలా ఒక గెటెడ్ కమ్యూనిటీ నిజాంపేటలో ఒక అప్రూవ్డ్ లే అవుడ్ ను ఉల్లంఘించి కట్టిన అడ్డుగోడను ఇటీవల హైడ్రా కూల్చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రజలు ఉపయోగిస్తూ వచ్చిన రోడ్డు మూసేసి కట్టిన గోడవల్ల చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వచ్చేంది. దీనికి ఎక్కువ సమయం పట్టేంది. ఈ గోడ కూల్చడం తో ప్రజలంతా ఊపిరిపీల్చుకున్నారు. రోజూ సుమారు 25000 వేల మంది ప్రయాణిస్తూ వచ్చిన రోడ్డు మళ్లీ తెరుచుకుంది.

ఇదెలా జరిగింది...

నిజాంపేట మునిసిపాలిటీలోని 10 కాలనీల నివాసితుల రాకపోకలను ఆటంకం కలిగిస్తూ ఇలా ఒక గేటెడ్ కమ్యూనిటీ అడ్డుగోడ నిర్మించింది. అవుటర్ రింగ్ రోడ్ (Outer Ring Road) మల్లంపేట నుండి బాచుపల్లి X రోడ్ల ఎగ్జిట్ నుంచి ప్రగతి నగర్ వరకు దూరం కేవలం 3 కి.మీ మాత్రమే ఉండేది. 'ప్రణీత్ APR ప్రణవ్ ఆంటిలియా' రావడంతో ఈ దూరం 8 కి.మీ పెరిగింది. బయటి వ్యక్తులు తమ గేటెడ్ కమ్యూనిటీ లోపలి నుండి వాహనాలు నడపకుండా ఉండేందుకు గోడ నిర్మించడంతో ఈ దూరం 8 కి.మీ కు పెరిగింది. ఈ గోడ తమ స్థలంలోనే ఉందని వాదించేవారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని మల్లంపేట నివాసితులు హైడ్రా సంస్థను సంప్రదించారు. గతంలో ఉండిన 40-60 అడుగుల రోడ్డును మళ్ళీ ఉపయోగించుకునేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దీనివల్ల తమ ప్రయాణ సమయం దూరం తగ్గుతుందని వారు హైడ్రాను కోరారు.

దీనితో హైడ్రా రంగంలోకి దిగింది. అడ్డుగోడ సమస్యను పరిశీలించి, దర్యాప్తు చేసింది. హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HUDA) ఆమోదించిన లేఅవుట్ ప్రకారం ‘ప్రణీత్ APR ప్రణవ్ ఆంటిలియా’ ఈ గోడను నిర్మించలేదని HYDRAA కనుగొంది. ఇది లేఅవుట్ ఉల్లంఘనగా బావించింది. దీనితో ఈ కాంపౌండ్ గోడను హైడ్రా అధికారులు కూల్చివేసారు.ఈ ప్రాంతానికి చెందిన 25000 మంది ప్రయాణిలకు బాట చూపారు.



ప్రణీత్ APR ప్రణవ్ ఆంటిలియాలో నివసిస్తున్న నివాసితులు బస్తీ ప్రజలు మరియు ఇతర కాలనీల నివాసితులు తమ ఇళ్లకు దగ్గరగా వెళ్లడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పారు.

"పది కాలనీలు/మల్లంపేట గ్రామస్తులకు (దుండిగల్/మల్లంపేట/బాచుపల్లి సమీపంలో) దారి ఇవ్వడానికి హైడ్రా కాంపౌండ్ వాల్‌ను కూల్చివేసినప్పుడు, కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చడానికి హైడ్రా ప్రయత్నిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. "కాంపౌండ్ వాల్ తొలగింపుతో ఈ ప్రాంతంలోని వేలాది మంది ప్రజలు ప్రయోజనం పొందుతారు. బాచుపల్లి-మల్లంపేట (ఇటీవల ORR వద్ద ప్రారంభించబడిన ఎగ్జిట్)లో ట్రాఫిక్ చాలా వరకు తగ్గుతుంది. లేఅవుట్‌లోని కొంతమంది వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాలకు అనుగుణంగా ఉద్దేశపూర్వకంగా సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు" అని హైడ్రా కమిషనర్ AV రంగనాథ్ హెచ్చరించారు.

HMDA తుది లేఅవుట్ ఆమోదంలోని 7వ నిబంధనను రంగనాథ్ ఉదహరించారు, అక్కడ "దరఖాస్తుదారుడు సైట్ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించడానికి మరియు పొరుగు భూములకు ప్రాప్యతను అందించడానికి రోడ్లను బ్లాక్ చేయకూడదని" స్పష్టంగా పేర్కొనబడింది.

Read More
Next Story