చెరువులు, నాలాలపై త్వరలో హైడ్రా తుది నోటిఫికేషన్
x
కూలిన చెట్లను తొలగిస్తున్న హైడ్రా సిబ్బంది

చెరువులు, నాలాలపై త్వరలో హైడ్రా తుది నోటిఫికేషన్

హైదరాబాద్ నగరంలో అవుటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న చెరువులు, నాలాల పరిరక్షణకు హైడ్రా కార్యాచరణ రూపొందించింది.


హైదరాబాద్ నగరంలో అవుటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న చెరువులు, నాలాల ఎఫ్ టీ ఎల్ మార్కింగ్ చేస్తూ తుది నోటిఫికేషన్ ను ఈ ఏడాదిలోగా విడుదల చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వెల్లడించారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలను పరిరక్షించడమే పరమావధిగా ఏర్పడిన హైడ్రా ప్రస్థుతం నగరంలో ఆరు చెరువులను అభివృద్ధి చేస్తుందని ఆయన తెలిపారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో రంగనాథ్ మాట్లాడారు. హైడ్రా ఒకటి రెండేళ్లకు పరిమితం కాదని, వందేళ్ల ప్రళాళికతో పనిచేస్తుందని చెప్పారు. చెరువులు, నాలాల ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ల నిర్ధారణ కోసం తాము సాంకేతిక ఆధారాలతో కసరత్తు చేస్తున్నామని చెప్పారు.


సీఎస్ఆర్ పేరిట చెరువుల కబ్జా బాగోతం
హైదరాబాద్ నగరంలో చెరువుల వద్ద వాటర్ ఫ్రంట్ పేరిట భూముల ధరలు కోట్లాది రూపాయలు పలుకుతుండటంతో కొన్ని కార్పొరేట్ సంస్థలు చెరువుల ను కార్పొరేట్ సోషల్ రెస్సాన్స్ బుల్ పేరిట అభివృద్ధి చేస్తామని చెప్పి వాటిని ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నారని, దీనిపై చెరువులు, నాలాలను నోటిఫై చేశాక చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు.

హైడ్రా ఏర్పడే నాటికి...
హైడ్రా ఏర్పడే నాటికి ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్లలో నిర్మించుకున్న ఇళ్ల విషయంలో ఎలాంటి చర్యలు ఉండవని ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసిందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. నీటివనరులు, ప్రభుత్వ, పార్కు స్థలాలు కబ్జాల పాలు కాకుండా కాపాడటంతోపాటు విపత్తుల నుంచి నగర ప్రజలను రక్షించేందుకు హైడ్రా పనిచేస్తుందన్నారు.

810 చోట్ల నేల‌కొరిగిన చెట్ల తొల‌గింపు
వ‌ర్షం ప‌డిన‌ప్పుడు వ‌ర‌దనీరు, వ‌ర్షాకాలం ఆరంభానికి ముందు నుంచి పూడిక తొల‌గింపు పనులను మాన్సూన్ ఎమ‌ర్జ‌న్సీ టీమ్‌లు చేస్తున్నాయి. జులై 1వ తేదీ నుంచి హైడ్రా కార్య‌క్ర‌మం మ‌రింత వేగాన్ని అందుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కూ 15665 క్యాచ్‌పిట్ల‌ను హైడ్రా క్లీన్ చేసింది. 359 క‌ల్వ‌ర్టుల‌లో పూడిక‌ను హైడ్రా తొల‌గించింది. 1670 చోట్ల నాలాల్లో చెత్త‌ను బ‌య‌ట‌కు తీసి త‌ర‌లించింది. ఇలా 4609 వాట‌ర్ లాగింగ్ పాయింట్ల‌ను హైడ్రా క్లియ‌ర్ చేసింది. వ‌ర్షాల వేళ 4974 ప్రాంతాల్లోపేరుకుపోయిన చెత్త ను తొల‌గించింది.



ప‌డిపోయిన చెట్ల‌ను తొల‌గించిన హైడ్రా

వ‌ర్షం ప‌డిందంటే చాలు న‌గ‌రంలో చెట్లు నేల‌కొరుగుతున్నాయి. ర‌హ‌దారుల‌కు అడ్డంగా ప‌డి వాహ‌న రాక‌పోక‌ల‌కు, విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయంగా మారుతున్నాయి. జోరున వ‌ర్షం ప‌డుతుండ‌గానే ప‌డిపోయిన చెట్ల‌ను తొల‌గించాల్సిన ప‌రిస్థితి. ట్రాఫిక్ జామ్‌లు ఏర్ప‌డిన‌ప్పుడు హైడ్రా భారీ వాహ‌నాలు వెళ్ల‌లేని ప‌రిస్థితులుంటే.. బైకుల‌పై వెళ్లి చెట్టు కొమ్మ‌ల‌ను క‌ట్ చేసి తొల‌గించేలా హైడ్రా చ‌ర్య‌లు తీసుకుంది.

త‌లాబ్ చంచ‌లంలో చెత్త తొల‌గింపు..
మ‌ల‌క్‌పేట‌, డ‌బీర్‌పురా ద‌ర్వాజా ద‌గ్గ‌ర గ‌ల గంగా న‌గ‌ర్ నాల‌లో భారీగా పోగైన చెత్త‌ను హైడ్రా తొల‌గించింది. ఒకే రోజు 15 ట్ర‌క్కుల చెత్త ఇక్క‌డి నుంచి త‌ర‌లించారు. అల్వాల్, మల్కాజ్‌గిరి, కూకట్‌పల్లి, టోలిచౌకి, త‌లాబ్‌చంచ‌లంలో పెద్ద‌యెత్తున పూడిక తీత ప‌నులు కొన‌సాగుతున్నాయి.అమీర్‌పేట మైత్రి వ‌నం వ‌ద్ద ఎగువ ప్రాంతాల నుంచి కొట్టుకువ‌చ్చిన చెత్త‌ను తొల‌గించే ప‌ని నిరంత‌రంగా సాగుతోంది.


Read More
Next Story