పోలీసులకు ‘బొమ్మ’ చూపిస్తున్న ఐ బొమ్మ రవి
x

పోలీసులకు ‘బొమ్మ’ చూపిస్తున్న ఐ బొమ్మ రవి

12 రోజులపాటు కస్టడీ విచారణకు కోర్టు అనుమతించిన నేపధ్యంలో ఈరోజు(Cyber Police)సైబర్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు


విచారణలో పోలీసులకే ఐ బొమ్మ రవి బొమ్మ చూపిస్తున్నాడు. సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం ఇమ్మంది రవిని మూడోసారి విచారణ కోసం కస్టడీలోకి తీసుకున్నారు. 12 రోజులపాటు కస్టడీ విచారణకు కోర్టు అనుమతించిన నేపధ్యంలో ఈరోజు(Cyber Police)సైబర్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే(iBomma Ravi) రవిని పోలీసులు రెండుసార్లు విచారించిన విషయం తెలిసిందే. రవి మీద నమోదైన ఐదుకేసుల్లో విచారించాలని కోరుతు పోలీసులు ఇప్పటికే ఎనిమిదిరోజులు విచారించారు. అయినా ఎలాంటి ఉపయోగం కనబడలేదు.

అందుకనే మూడోసారి విచారణకు తీసుకుంటే ఏమన్నా విషయాలు రాబట్టవచ్చని ఆలోచించి పోలీసులు కోర్టును కస్టడీ విచారణకు కోరటంతో కోర్టు కూడా అనుమతించింది. పైరసీ లింకులు, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్, కొత్త సినిమాల పైరసీ ఆరోపణలు రవిపైన ఉన్నవిషయం తెలిసిందే. సంవత్సరాలతరబడి తెలుగు సినీపరిశ్రమలోని చాలామంది నిర్మాతలను ఆర్ధికంగా గట్టి దెబ్బకొట్టాడు. కొత్త సినిమా రిలీజవ్వటం ఆలస్యం గంటల వ్యవధిలోనే హెచ్డీ క్వాలిటీ పైరసీ ప్రింట్ ఐబొమ్మ వెబ్ సైట్లో ఉచితంగా జనాలకు అందుబాటులోకి తెచ్చేవాడు. ఇటు సినిమా ఫీల్డుతో పాటు అటు పోలీసులకు కూడా రవి పెద్ద తలనొప్పిగా తయారయ్యాడు.

అలాంటి రవికోసం ఏళ్ళ తరబడి పోలీసులు వలపన్నితే చివరకు రెండునెలల క్రితం కుకట్ పల్లిలోని తనింట్లోనే దొరికాడు. అరెస్టయితే అయ్యాడుకాని రవి పోలీసులకు విచారణలో బొమ్మ చూపిస్తున్నాడు. ఎన్నిరోజులు విచారించినా రవి నోరిప్పటంలేదని సమాచారం. సినిమాలను పైరసీ చేస్తున్నట్లు, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నట్లుగా రవి మొదట్లోనే అంగీకరించాడు. అయితే ఆ తర్వాత ఇంకా ఎలాంటి సమాచారం ఆశించి పోలీసులు రవిని విచారిస్తున్నారో అర్ధంకావటంలేదు. ఎన్నిరోజులు విచారించినా రవి అయితే నోరిప్పటంలేదని తెలిసింది. మరి పోలీసులు ఈరోజు నుండి 12 రోజులు రవిని ఏమి విచారిస్తారు ? తాను ఏమి చెబుతాడో చూడాలి.

Read More
Next Story