ఎక్కడికైనా రెడీ, ఎర్రవల్లిలో నైనా ఢీ
x

ఎక్కడికైనా రెడీ, ఎర్రవల్లిలో నైనా ఢీ

కెసీఆర్ కు మీడియా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్


జల వివాదాల పై చర్చించడానికి బిఆర్ఎస్ అధ్యక్షుడు కెసీఆర్ కు ఏదేని ఇబ్బంది ఉంటే తానే ఎర్రవెల్లి ఫాం హౌజ్ కు వెళతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.జల వివాదాల కోసం చర్చల కోసం తాను సిద్దంగా ఉన్నానని బుధవారం జరిగిన మీడియా సమావేశంలో అన్నారు.

అందరి పోరాటం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే గత బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను సర్వనాశనం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్లలో కెసీఆర్ ప్రభుత్వం కృష్ణానదిపై ఏ ఒక్క ప్రాజెక్టు నిర్మించలేదన్నారు.

బనకచర్ల వివాదంలో తెలంగాణ హక్కులను కాలరాస్తే ఊరుకునేది లేదన్నారు. దేవుడు ఎదుకొచ్చినా నిటారుగా నిలబడి తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతానన్నారు. కెసీఆర్ ప్రజా సమస్యల పరిష్కారానకి అసెంబ్లీలో చర్చించాలని సూచించారు.

కృష్ణా, గోదావరి జలాల విషయంలో చర్చించడానికి మంత్రులనందరినీ కెసీఆర్ దగ్గరికి పంపిస్తానని అవసరమైతే తానే కెసీఆర్ వద్దకు వెళతానని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయిందని దాన్ని బతికించుకోవడానికి కేసీఆర్ నానా తంటాలు పడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కాళేశ్వరంపై వాస్తవాలతో కూడిన నివేదికను కేంద్రం ఎదుట పెట్టామని తెలిపారు. కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చిద్దామని కేసీఆర్‌కు ఎంత మొత్తుకున్నా అర్థం కావడం లేదన్నారు.

గత ప్రభుత్వ నిర్ణయాల వల్లే తెలంగాణకు నష్టం వాటిల్లిందని సీఎం రేవంత్‌ అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై దుష్ ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్‌ రెండేళ్ల పాలనలో తెలంగాణ అభివృద్ది చెందుతుందని రేవంత్‌ అన్నారు.

ఎపీ మాజీసిఎం జగన్ తెలంగాణ మాజీ సీఎం అనుబంధం వల్ల ఇక్కడి ప్రజలకు తీరని అన్యాయం జరిగిందన్నారు.తెలంగాణప్రజలకు మరణ శాసనం ఇచ్చే హక్కు కెసీఆర్ కు ఎవరూ ఇవ్వలేదన్నారు.

అంతకుముందు నీటి పారుదలా శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇచ్చారు.

Read More
Next Story