‘కేటీఆర్ నాయకత్వాన్ని ఒప్పుకోను’..!
x

‘కేటీఆర్ నాయకత్వాన్ని ఒప్పుకోను’..!

వెన్నుపోటు రాజకీయాలు నాకు రావు. చేయను. తిక్కతిక్కగానే ఉంటా. పార్టీని నడిపించే సత్తా మీకు లేదు.


బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కేసీఆర్‌ను మాత్రమే నాయకుడిగా అంగీకరిస్తానన్నారు. ఆయన కాకుండా మరెవరినీ తన నాయకుడిగా అంగీకరించనని తేల్చి చెప్పారు. కొన్ని రోజులుగా ఆమెపై వస్తున్న అనేక వార్తలు, ఆమె రాజకీయ భవిష్యత్తు, తన భవిష్యత్ కార్యాచరణపై జరుగుతున్న ప్రచారం వంటి అంశాలపై ఆమె గురువారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించి స్పందించారు. ఇందులోనే ఆమె పార్టీ నాయకత్వం, కేసీఆర్ సక్సెసర్ వంటి అంశాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ నాయకుడిగా తాను కేసీఆర్‌ను మరొకరిని అంగీకరించనని తేల్చి చెప్పారు. దీంతో ఆమె కేటీఆర్‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని చర్చ మొదలైంది.

ఇటీవల హరీష్ రావు సైతం.. పార్టీ పగ్గాలను కేటీఆర్‌కు అప్పగిస్తే తాను స్వాగతిస్తానని చెప్పారు. ‘‘నేను కేసీఆర్ మాదిరిగానే ఏది ఉన్నా సూటిగా చెప్తాను. వెన్నుపోటు రాజకీయాలు నాకు రావు. చేయను. తిక్కతిక్కగానే ఉంటా. పార్టీని నడిపించే సత్తా మీకు లేదు. నాకు నీతులు చెబుతున్నారా? వరంగల్ మీట్ సక్సెస్ అయిందని చెప్పుకునే వారిని చూసి జనాలు నవ్వుతున్నారు. ఏమున్నా పార్టీ ఫోరమ్ లోపల మాట్లాడాలన్నారు. నేను బయటే మాట్లాడతా. తెలంగాణ ఏర్పాడిన తర్వాత తెలంగాణ సోయితే పరిపాలన జరగట్లేదు. నా నాయకుడు కేసీఆర్ మాత్రమే’’ అని ఆమె పునరుద్ఘాటించారు.

Read More
Next Story