![అల్లు అర్జున్ విషయంలో నా జోక్యం ఉండదు: రేవంత్ అల్లు అర్జున్ విషయంలో నా జోక్యం ఉండదు: రేవంత్](https://telangana.thefederal.com/h-upload/2024/12/13/498084-revanth-reddy.webp)
అల్లు అర్జున్ విషయంలో నా జోక్యం ఉండదు: రేవంత్
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్న అరెస్ట్ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్న అరెస్ట్ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఇందులో తన జోక్యం ఏమాత్రం ఉండదని తేల్చి చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని, చట్టం ఎవరికీ చుట్టం కాదని వ్యాఖ్యానించారు. ఇప్పటికే అల్లు అర్జున్న అరెస్ట్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పలువరు రాజకీయ నాయకులు.. అల్లు అర్జున్ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నారు. పాలకుల వైఫల్యానికి.. జాతీయ అవార్డు గ్రహితను అరెస్ట్ చేయడం ఏమాత్రం సమంజసం కాదని అంటున్నారు. ఈ విధంగా ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ సహా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్‌లు పెట్టారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ‘‘చట్టం ముందు అందరూ సమానులే. చట్టపరమైన ప్రక్రియ జరుగుతుంది. తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు’’ అని తెలిపారు.
అయితే అల్లు అర్జున్‌ను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అక్కడ వైద్య పరీక్షలు కూడా ముగిశాయి. మరికాసేపట్లో ఆయనను నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. ఇదిలా ఉంటే ఇంతలో అల్లు అర్జున్న నివాసానికి మెగాస్టార్ చిరంజీవి దంపతులు, నాగబాబు చేరుకున్నారు. బన్నీ అరెస్ట్‌తో తన షూటింగ్‌లను రద్దు చేసుకుని.. అర్జున్ నివాసానికి చేరుకున్నాడు చిరంజీవి. ప్రస్తుతం అర్జున్ అరెస్ట్ పరిణామాలపై ఆయన ఆరా తీశారు. ఏమా కాదని బన్నీ కుటుంబీకులకు ధైర్యం చెప్పారు. అక్కడి నుంచి చిరంజీవి.. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు నిర్మాత దిల్ రాజు, బన్నీ వాసులు చేరుకున్నారు.
నాలుగు గంటలకు క్వాష్ పిటిషన్ విచారణ..
ఇదిలా ఉంటే తనపై నమోదైన కేసు రద్దు చేయాలంటూ అల్లు అర్జున్ ఫైల్ చేసిన క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఈరోజు నాలుగు గంటలకు విచారణ జరపనుంది. ఈ పిటిషన్‌లో సోమవారం వరకు తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని బన్నీ కోరారు.