సూగూరులో పండిత గల్లు, శైవ ఆత్మాహుతి శిలలు
x
పండిత గల్లు, వీరశైవ భక్తురాలి ఆత్మాహుతి శిలలు

సూగూరులో పండిత గల్లు, శైవ ఆత్మాహుతి శిలలు

వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రానికి 10 కీలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం సూగూరు. ఇక్కడి పురాతన శిలలు బయటపడ్డాయి. అవి చాలా ప్రత్యేకం. ఎలా అంటే..


వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రానికి 10 కీలోమీటర్ల దూరంలో కృష్ణానదికి సమీపంలో ఉన్న గ్రామం సూగూరు. పాత సూగూరులో పాటిగడ్డ మీద కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు బైరోజు సోదరులు చంద్రశేఖర్, శ్యామసుందర్‌లు పురాతన ఆలయనిర్మాణం, అనేక శిల్పాలను గుర్తించారు. వాటిలో రాచరికపు ఆహార్యంతో, శైవతాంత్రిక యోగాసనంలో కూర్చున్న పండితుడు.. కుడిచేత గంటం, ఎడమచేత పుస్తకం పట్టుకుని ఉన్నాడు. 10,11వ శతాబ్దపు శైలిలో చెక్కబడిన ఈ శిల్పం ఒక పండితగల్లు. వీరులకు వీరగల్లుల తరహాలోనే పండితులకు పండితగల్లులు ఉంటాయి. ఇది గతంలో లభించిన పండితగల్లులకు భిన్నమైన కొత్త శిల్పం.

ఇక్కడే అరుదైన అపూర్వమైన మరొక శిల్పం లభించింది. అదే స్త్రీ ఆత్మాహుతి శిల. ఈ స్త్రీ పద్మాసనంలో అంజలిముద్రపట్టి కూర్చుని ఉంది. తలపై రుద్రాక్షల కిరీటం, భుజాలపై, దండరెట్టలకు, ముంజేతులపై రుద్రాక్షమాలలున్నాయి. చెవులకు కుండలాలున్నాయి. విరబోసిన జుట్టు భుజాలపైవాలి ఉంది. అర్ధనగ్నంగా ఉన్న ఈ స్త్రీ తలపైన శివలింగం ధరించింది. సిద్ధిపేట జిల్లా కంచరిమల్యాలలో, పందిళ్ళలో ఈ శిల్పాన్ని పోలిన స్త్రీల ఆత్మాహుతి శిల్పాలను గతంలో చరిత్ర బృందం గుర్తించింది. సూగూరు స్త్రీ ఆత్మాహుతి శిల్పం వాటికంటే భిన్నమైంది.ఈ శిల్పం శైలి రీత్యా 15వ శతాబ్దానికి చెందింది.

Read More
Next Story