రాష్ట్రం బాగుపడాలంటే ప్రభుత్వమే మారాలా..?
x

రాష్ట్రం బాగుపడాలంటే ప్రభుత్వమే మారాలా..?

కాంగ్రెస్ సర్కార్‌పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.


తెలంగాణలో రైతుల కష్టాలు పట్టించుకునే నాథుడే కరువయ్యాడంటూ రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రీజినల్ రింగ్ రోడ్డులో భూములు కోల్పోతున్న చౌటుప్పల్ డివిజన్ రైతులు తొక్కని గడపలేదని, ఢిల్లీలో పెద్దలను కలిసినా వారికి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన మార్పుకు ఇప్పటికీ రైతులు కష్టాలను ఎదుర్కొంటున్నారని అన్నారు. ‘‘దివీస్ యాజమాన్యం కోసం గత ప్రభుత్వం అలైన్‌మెంట్ మార్చింది. ఇప్పుడు దక్షిణ భాగం అలైన్‌మెంట్ మారాటంలే ఉత్తరభాగం మళ్లీ మారాలి. అది జరగాలంటే ప్రభుత్వమే మారాలేమో’’ అంటూ రాజగోపాల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ట్రిపుల్‌ ఆర్‌ భూనిర్వాసితులతో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగానే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తా..

‘‘నాకు అన్యాయం జరిగినా ఊరుకుంటా. ఓర్చుకుంటా. కానీ ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ కూర్చోను. వారికి అన్యాయం జరగడానికి ఎంత దూరమైనా వెళ్తా. ఆర్ఆర్ఆర్ రద్దయినా సరే రైతులకు అన్యాయం జరగనివ్వను. భూనిర్వాసితుల కోసం నిలబడతా.ప్రభుత్వాన్ని ఎక్కడిక్కడ స్తంభంపజేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. ప్రజలే నా బలం, బలగం. వారి కోసం ఎలాంటి పోరాటమైనా చేస్తా. అవసరం అయితే ఎలాంటి త్యాగానికైనా రెడీ. అందుకు ప్రజలు సిద్ంగా ఉండాలి. ేను అధికార పార్టీ ఎమ్మెల్యేను. కానీ ప్రజలకు అన్యాయం జరుగితే ప్రభుత్వంతో పోరాడటానికి ఏమాత్రం వెనకాడను’’ అని స్పష్టం చేశారు.

కోట్లాటకు ఏమాత్రం వెనకాడను..

‘‘నేను లాలూచీపడి సీఎం దగ్గరకి వెళ్లి పదవి తెచ్చుకున్నా చప్పుడు చేయకుండా కూర్చోను. నాకు మా ప్రాంత ప్రజలు, వారి సంక్షేమమే ముఖ్యం. అదే విషయాన్ని సీఎంకూ చెప్తా. రాజగోపాల్‌రెడ్డి గట్టి వాడు కోట్లాడటానికి వెనుకాడరనే మీ నమ్మకాన్ని వమ్ము చేయను. భూమికి రైతుకు మధ్య భావోద్వేగ అనుబంధం ఉంటుంది.. అది విడదీయలేనిది. భూమి అంటే వ్యవసాయం ఒక్కటే కాదు అది ఒక స్టేటస్. ట్రిపుల్‌ ఆర్‌లో మునుగోడు నియోజకవర్గ ప్రజలే ఎక్కువ భూమిని కోల్పోతున్నారు. వీరి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా.. అవసరమైతే కేంద్ర మంత్రులను కలుస్తా. మీకు న్యాయం జరిగేంత వరకు శాసనసభ్యుడిగా మీతో పాటు కలిసి పోరాడుతా’’ అని అన్నారు.

Read More
Next Story