మే నెల 17 దాకా తెలంగాణ వాతావరణం ఎల్లో అలెర్ట్
x

మే నెల 17 దాకా తెలంగాణ వాతావరణం ఎల్లో అలెర్ట్

మంగళ, బుధ, గురు వారాలు కొన్ని జిల్లాల్లో గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. ఉరుములు, మెరుపులతో వర్షం కురువవచ్చు.


తెలంగాణలోని 17 జిల్లాలలో వచ్చే మూడు రోజులలో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ (IMD) ఒక ప్రకటన విడుదల చేసింది.

ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలు. హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని, సాయంత్రం వరకు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది.

హైదరాబాద్ పరిసరాలకు సంబంధించి వాతావరణం మేఘావృతమయి ఉంటుంది. అక్కడక్కడ చిరుజల్లులు పడవచ్చు. రాత్రి పూట కనీస ఉష్ణోగ్రత 26మంగళ, బుధవారాలు కొన్ని జిల్లాల్లో గంటకు 30 కిలో మీటర్ల నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని... ఉరుములు, మెరుపులతో వర్షం కురువవచ్చునని తెలిపింది., పగటి గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్ దాకా ఉంటుంది ఐఎండి తెలిపింది. ఈ సూచనలు మే 17 దాకా వర్తిస్తాయి.


మంగళ, బుధవారాలుగురువారాలలో ఈ జిల్లాల్లో గంటకు 30 కిలో మీటర్ల నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఉరుములు, మెరుపులతో వర్షం కురువవచ్చునని ఐఎండి తెలిపింది.

.బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.

గురువారం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు నిజామాబాద్‌లో వర్షాలు కురువవచ్చునని పేర్కొంది. సిద్దిపేట, మేడ్చల్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముంది.

శుక్రవారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో, శనివారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్‌, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.


Read More
Next Story