![Bhatti Vikramarka Bhatti Vikramarka](https://telangana.thefederal.com/h-upload/2024/11/21/492251-bhatti-vikramarka.webp)
Bhatti Vikramarka | ‘ఏడాదిలో రూ.52వేల కోట్ల అప్పులు చేశాం.. దేనికంటే’
మిగులు బడ్జెట్‌తో అవతరించిన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత బీఆర్ఎస్ సర్కార్‌దేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులన్నింటినీ తాము సరిచేసుకుంటూ వస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మిగులు బడ్జెట్‌తో అవతరించిన తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ల కాలంలో అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత బీఆర్ఎస్ సర్కార్‌దేనని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసిని ప్రతి నెలా ఒకటో తేదీ వస్తే ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఆర్థిక వ్యవస్థ ఉందని వివరించారు. ఛిన్నా భిన్నమైన ఆర్థిక వ్యవస్థను ప్రజలపై భారం పడకుండా ముందుకు నడిపిస్తున్నామని, ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థి తిరిగి కోలుకుంటుందని ఆయన చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన అత్యద్భుతంగా ఉంది, అది చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని, ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. వాళ్లు ఎంత ప్రయత్నించిన ప్రజలకు నిజానిజాలు తెలుసని, తమ నాయకుడిని ఎలా ఎన్నుకోవాలో కూడా ప్రజలకు తెలిసే గతేడాది ఓటు వేశారని అన్నారు. ఈ సందర్భంగా డిసెంబర్ 9న తెంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు, ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ కార్యక్రానికి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కూడా రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కాగా ప్రపంచ వాతావరణం వల్ల గ్రీన్ ఎనర్జీపై తమ ప్రభుత్వం దృష్టి పెడుతుందని, త్వరలోనే కొత్త విద్యుత్ పాలసీని తీసుకురానున్నామని భట్టి విక్రమార్ వెల్లడించారు.
‘‘బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.52వేల కోట్ల అప్పులు తెచ్చాం. చేసిన అప్పులను తిరిగి బ్యాంకులకే కట్టే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం బీఆర్ఎస్ చేతకాని పాలనే. అప్పులకు రాష్ట్రాన్ని వచ్చే అదనపు ఆదాయాన్ని కూడా కలిపి బ్యాంకులకే కట్టాల్సిన దుస్థితి వచ్చింది. సంక్షేమ పథకాలకు రూ.61వేల కోట్లు ఖర్చు చేశాం. రైతు భరోసా, రుణమాఫీ, చేయూత, ఆరోగ్యశ్రీ పథకాలకు నిధులు కేటాయించాం. ప్రతి రోజూ అడ్డగోలుగా, ప్రభుత్వంపై బురదజల్లేలా మాట్లాడటే పనిగా బీఆర్ఎస్ నేతలు ప్రవర్తిస్తున్నారు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘‘గత ప్రభుత్వం విద్యుత్ శాఖలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. ఒక్క యాద్రాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ల వద్ద గత ప్రభుత్వం నిర్ణయాల వల్ల ప్రతి ఏటా 170 కోట్లకు పైగా భారం. కొంతమంది స్వార్థం వల్ల విద్యుత్ రంగంలో ఆర్థిక భారం పడుతుంది. ఛత్తీస్‌గఢ్ ఒప్పందాల వల్ల 630 ఆర్థిక భారం ప్రభుత్వం పై పడుతుంది. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిచేసి యాదద్రిలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అనుసంధానం చేయబోతున్నాం. గత ప్రభుత్వం తప్పుడు నిర్ణయాల వల్ల విద్యుత్ డిస్కంల పై దాదాపుగా 10వేల కోట్ల భారం పడుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 24 గంటల కరెంటు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. 50లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. భవిషత్ లో అన్ని రకాల విద్యుత్ ఉత్పత్తి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. రాష్ట్రంలో కరెంట్ కోతలు లేకుండా చర్యలు తీసుకున్నాం. అన్ని రంగాలతో కూడిన విజన్ డాక్యుమెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ తయారు చేస్తోంది. 1.28 కోట్ల దరఖాస్తులు ప్రజా పాలనలో వచ్చాయి’’ అని తెలిపారు.