
Five deaths in Miyapur
Mystery deaths | మియాపూర్ లో దారుణం..ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి
మియాపూర్ లో దారుణం చోటుచేసుకున్నది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించటం(Five dead) సంచలనం కలిగిస్తోంది
మియాపూర్ లో దారుణం చోటుచేసుకున్నది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించటం(Five dead) సంచలనం కలిగిస్తోంది. విషయం ఏమిటంటే మియాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలోని మక్త మహబూబ్ పేట్ కాలనీలో నివాసం ఉంటున్న ఉప్పరి లక్ష్మయ్య(60), ఉప్పరి వెంకటమ్మ(55), కూతురు కవిత(24) అల్లుడు అనీల్ (32) మనవడు అప్పు(2)లు మరణించారు. విషయం తెలియగానే పోలీసులు ఘటన జరిగిన ఇంటికి చేరుకున్నారు. క్లూస్ టీం కూడా చేరుకున్నది. వీరిమరణాలకు కారణాలు తెలీలేదు. వీరంతా ఆత్మహత్య(Suicides) చేసుకున్నారా లేకపోతే ఎవరైనా హత్యచేశారా(Murders) అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ కోసం గాంధీ ఆసుపత్రి(Gandhi Hospital)కి తరలించారు. మృతులంతా కర్నాటక రాష్ట్రానికి చెందిన వారుగా పోలీసులు నిర్ధారించారు.
Next Story