రాయదుర్గంలో ఎకరం రు. 101 కోట్లు
x
Rayadurg area

రాయదుర్గంలో ఎకరం రు. 101 కోట్లు

వేలంపాటద్వారా ప్రభుత్వం తక్కువలో తక్కువ రు. 2 వేలకోట్లను సమీకరించాలని నిర్ణయించింది


రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో భూముల విలువ ఆకాశాన్నిదాటి ఇంకా పైకి వెళిపోతున్నట్లుంది. ఇప్పటికే ఎగువమధ్యతరగతి జనాలు భూమిని కలల్లో తప్ప కొనలేకపోతున్నారు. ఇకనుండి భూమికొనాలని కలకనటం కూడా కష్టంగానే ఉండేట్లుంది. ఇంతకీ విషయంఏమిటంటే అక్టోబర్లో భూమిని(TGIIC Land Auction) వేలంవేయటానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం రంగం సిద్ధంచేసింది. గచ్చిబౌలి(Gachibowli), హైటెక్ సిటికి(High-tech City) దగ్గరలోనే ఉన్న రాయదుర్గం(Rayadurg)నాలెడ్జి సెంటర్లో భూమిని వేలంవేయాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. 18.67 ఎకరాలను వేలంవేయాలని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) నిర్ణయించింది.

18,67 ఎకరాలను వేలంద్వారా అమ్మేందుకు అన్నీ ఏర్పాట్లు చేసింది. ఎకరా ప్రారంభ ధరను రు. 101 కోట్లుగా డిసైడ్ చేసింది. ప్రారంభ ధరే రు. 101 కోట్లయితే వేలంపాటలో ఎకరం ధర మరింత ఎక్కువగా పలుకుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. వేలంపాటద్వారా ప్రభుత్వం తక్కువలో తక్కువ రు. 2 వేలకోట్లను సమీకరించాలని నిర్ణయించింది. ఈ వేలంలో దరఖాస్తులు అందించేందుకు అక్టోబర్ 6వ తేదీని ఆఖరుతేదీగా ప్రభుత్వం ప్రకటించింది. ఈవేలంతో పాటు నేరుగా కూడా పాల్గొనచ్చు. టీజీఐఐసి వేలంవేయబోయే భూమికి చుట్టూ పెద్దపెద్ద ఐటీ పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ కంపెనీలున్నాయి కాబట్టి ఆశించిన మొత్తంకన్నా ఎక్కువ ధరలే పలకచ్చని ప్రభుత్వం అనుకుంటోంది.

ఈటెండర్ల దాఖలుకు అక్టోబర్ 1వ తేదని గడువుగా ప్రభుత్వం ప్రకటించింది. రిజిస్ట్రేషన్ ఫీజు రు 1180 నాన్ రీఫండబుల్. టెండర్ డాక్యుమెంట్ ఫీజు ప్రతిప్లాటుకు రు. 10 లక్షలుగా నిర్ణయించింది. ఇది కూడా నాన్ రీఫండబులే. ఫ్లాట్ నెంబర్ 11లో రిజర్వ్ దర ఎకరాకు రు. 101 కోట్లు. ప్లాట్ నెంబర్ 15ఎ-2లో 7.67 ఎకరాలు. ఇక్కడ కూడా రిజర్వ్ ధర ఎకరాకు రు. 101 కోట్లే. టెండర్ ను కనీసం రు. 50 లక్షలు పెంచి అంటే 101 కోట్లకు అదనంగా 50 లక్షలు (101.50 కోట్లు) ఉండాలని నిబందన విదించింది. ఆసక్తి కలిగిన వారు అక్టోబర్ 4వ తేదీవరకు నేరుగా వచ్చి భూమిని పరిశీలిచుకోవచ్చని ప్రభుత్వం చెప్పింది. ప్రీ బిడ్ మీటింగుకు పై ప్రాంతంలోని చాలా ఐటికంపెనీల ప్రతినిదులు పాల్గొని కొనుగోలుకు ఆసక్తిని చూపించారు. మరి వేలంలో భూమి ఎంతధరకు అమ్ముడుపోతుందో చూడాలి.

Read More
Next Story