రేవంత్ మంత్రివర్గంలో కుమ్ములాటలు(వీడియోలు)
x
Ministers Adluri Laxman and Ponnam Prabhakar

రేవంత్ మంత్రివర్గంలో కుమ్ములాటలు(వీడియోలు)

ఇపుడు బయటపడిన విధానం చూస్తుంటే ఎప్పటినుండో మంత్రుల మధ్య తీవ్ర విభేదాలున్నట్లు అర్ధమవుతోంది


ఎనుముల రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో కుమ్ములాటలు బహిర్గతమయ్యాయి. ఇపుడు బయటపడిన విధానం చూస్తుంటే ఎప్పటినుండో మంత్రుల మధ్య తీవ్ర విభేదాలున్నట్లు అర్ధమవుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే సంక్షేమశాఖల మంత్ర అడ్లూరి లక్ష్మణ్(Aadluri) సహచర మంత్రులు గడ్డం వివేక్(Gaddam Vivek), పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) పై తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. వివేక్, పొన్నం తనను అవమానిస్తున్నారని ఫుల్లుగా ఫైర్ అయ్యారు. తన పక్కన కూర్చోవటానికి కూడా మంత్రి గడ్డం ఇష్టపడటంలేదని అడ్లూరి విరుచుకుపడ్డారు.

ఇంతకీ ఏమి జరిగిందంటే ఈమధ్యనే జరిగిన ఒక సమావేశంలో అడ్లూరి లక్ష్మణ్, గడ్డం వివేక్ పాల్గొన్నారు. సమావేశానికి ముందుగా వచ్చిన గడ్డం తర్వాత అడ్లూరి వచ్చి పక్కన కూర్చోగానే లేచి వెళ్ళిపోయారట. ఇదే విషయాన్ని లక్ష్మణ్ ప్రస్తావించారు. గడ్డం వివేక్ తనపక్కన కూర్చోవటానికి కూడా ఇష్టపడటంలేదని మండిపోయారు తాను పక్కన కూర్చోవటాన్ని వివేక్ ఓర్చుకోలేకపోతున్నట్లు చెప్పారు. విచిత్రం ఏమిటంటే గడ్డం, అడ్లూరి ఇద్దరూ ఎస్సీలే. కాకపోతే ఎస్సీలో వివేక్ ది మాల ఉపకుమైతే అడ్లూరిది మాదిగ ఉపకులం. ఇదే విషయాన్ని అడ్లూరి గుర్తుచేశారు. తాను మాదిగ ఉపకులానికి చెందిన వాడిని అవటం వల్లే గడ్డం తనను అవమానించారని నొచ్చుకున్నారు. మాదిగ ఉపకులంలో పుట్టడం తన తప్పా అని తీవ్ర ఆవేధన వ్యక్తంచేశారు.

ఇక రవాణాశాఖ మంత్ర పొన్నం పైన కూడా అడ్లూరి రెచ్చిపోయారు. పొన్నం మాట్లాడినట్లు తనకు అహంకారంగా మాట్లాడటం చేతకాదని ఎద్దేవాచేశారు. పొన్నంకు ఉన్నట్లు తనదగ్గర డబ్బులు కూడా లేవన్నారు. ఇంతకీ పొన్నంతో అడ్లూరికి సమస్య ఏమిటి ? ఏమిటంటే మీడియా సమావేశంలో మంత్రలు, అడ్లూరి, పొన్నం, బిదేక, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ ఆలీ పాల్గొన్నారు. ఆ సమావేశానికి అడ్లూరి ఆలస్యంగా హాజరయ్యారు. వివేక్ తో ఇదే విషయమై పొన్నం మాట్లాడుతు ‘మనకు టైం అంటే తెలుసు ఆ----గాడికి టైం గురించి ఏమి తెలుసు’ అంటు పరుష పదజాలం ఉపయోగించారు.

అయితే పొన్నం మరచిపోయిన విషయం ఏమిటంటే అడ్లూరి గురించి తానుచేసిన వ్యాఖ్యలు సమావేశంలో ఉన్న అందరికీ వినిపించాయి. తనముందున్న మీడియా మైకుల్లో ఒకటి ఆన్ లో ఉన్న విషయాన్ని పొన్నం గ్రహించలేదు. దాంతో వివేక్ తో అడ్లూరి గురించి పొన్నం చేసిన వ్యాఖ్యలు మైకులో అందరికీ వినిపించాయి. సదరు వీడియో తర్వాత అడ్లూరికి చేరింది. దాంతో అడ్లూరి సహచరమంత్రి పొన్నంపై బాగా మండిపోతున్నారు. ఇపుడీ వీడియోను కూడా అడ్లూరే సోషల్ మీడియాలో పోస్టుచేశారు. తనను సహచర మంత్రులు ఎలాగ అవమానిస్తున్నరనే విషయాన్ని స్వయంగా అడ్లూరే బయటపెట్టారు.

ఎప్పుడైతే మంత్రుల మధ్య విభేదాలు బయటపడ్డాయో వెంటనే పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ దృష్టిసారించారు. మంత్రులు అడ్లూరి, పొన్నంతో మాట్లాడారు. మంత్రులు సమన్వయంతో పనిచేయాలని హితవు పలికారు. ఇదేసమయంలో మంత్రి అడ్లూరి గురించి సహచరుడు పొన్నం చేసిన వ్యాఖ్యలను మరో మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తప్పుపట్టారు. ఒకమంత్రి గురించి మరో మంత్రి మాట్లాడటం పార్టీ, ప్రభుత్వానికి ఎంతమాత్రం మంచిదికాదన్నారు.

మాటలు వక్రీకరించారు : పొన్నం

అడ్లూరిపై తానుచేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగానే పొన్న అలర్టయ్యారు. తన మాటలను వక్రీకరించారని చెప్పారు. విచిత్రం ఏమిటంటే ఆడియో, వీడియోలో స్పష్టంగా వినబడుతున్నా, కనబడుతున్నా ఇంకా తన మాటలను వక్రీరించారని పొన్న సమర్ధించుకుంటున్నారు. ఎలక్ట్రానిక్ జర్నలిజం వచ్చేసిన తర్వాత మాటలను వక్రీకరించారని సమర్ధించుకోవటం ఎవరికీ సాధ్యంకాదు. ప్రింట్ మీడియా కాలంలో అయితే నోటికొచ్చింది అనేసిన తర్వాత ఏదైనా వివాదమైతే తన మాటలను వక్రీకరించారని దబాయించినా, సమర్ధించుకున్న చెల్లిపోయేది. కాని ఇప్పటి జర్నలిజంలో అదిసాధ్యంకాదు. మాట్లాడేటపుడే నోటిని అదుపులో పెట్టుకోకపోతే ఇలాంటి కష్టాలే వస్తాయి.

క్షమాపణ చెప్పాలి : అడ్లూరి

తనను దూషించిన మంత్రి పొన్నం ప్రభాకర్ తనకు వెంటనే క్షమాపణ చెప్పాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. పొన్నం తనను దూషిస్తున్నా సహచరమంత్రి వివేక్ ఏమీ మాట్లాడకపోవటాన్ని అడ్లూరి తీవ్రంగా ఆక్షేపించారు.

Read More
Next Story