Nitin Gadkari | రోడ్ సేఫ్టీ కోసం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్
హైదరాబాద్లో రోడ్ సేఫ్టీ కోసం పబ్లిక్ వాహనాల పర్యవేక్షణ కోసం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రిని రవాణశాఖ మంత్రి పొన్నం కోరారు.
హైదరాబాద్ నగరంలో రోడ్ సేఫ్టీ(Road Safety) కోసం పబ్లిక్ వాహనాల పర్యవేక్షణ కోసం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(Integrated Command Control Center) ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
- న్యూఢిల్లీలో తెలంగాణ ఎంపీలతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ (Telangana minister Ponnam Prabhakar)బుధవారం కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి తెలంగాణలో పలు సమస్యలను ఏకరవు పెట్టారు.
- తెలంగాణలో జాతీయ రహదారులు, రైల్వే అండర్ రోడ్ బ్రిడ్జి పెండింగ్ పనులు తదితర అంశాలపై నితిన్ గడ్కరీతో చర్చించారు.
తెలంగాణలో రవాణ శాఖ పనితీరుపై నివేదిక
తెలంగాణలో రవాణా శాఖ వాహనాల రిజిస్ట్రేషన్లను వాహన్ పోర్టల్ కు ,డ్రైవింగ్ లైసెన్సులు సారథి పోర్టల్ కు మార్చడం, వాహన స్క్రాపింగ్ సౌకర్యాల ఏర్పాటు,ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్కుల ఏర్పాటు, రోడ్డు భద్రత అవగాహన ప్రచారాలను నిర్వహించడం వంటి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి పొన్నం కేంద్రమంత్రికి వివరించారు.తెలంగాణలో ఇప్పటికే రెండు రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ కేంద్రాలు మంజూరయ్యాయని మంత్రి తెలిపారు. తెలంగాణలో 37 ఆటోమేటెడ్ వెహికల్ ఫిట్నెస్ టెస్టింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అనుమతించామని మంత్రి తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్రంలో కొనుగోలు చేసిన, రిజిస్టర్ చేసే వివిధ రకాల ఎలక్ట్రిక్ వాహనాలకు 100శాతం రోడ్డు పన్ను ,రిజిస్ట్రేషన్ ఫీజులను మినహాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పొన్నం కేంద్రమంత్రికి వివరించారు.
కేంద్ర ప్రభుత్వ మద్దతుకు విజ్ఞప్తి చేసిన అంశాలు
- మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఇటీవల 40 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించామని,ఢిల్లీలోని ఐడీటీఆర్ తరహాలో 15వ ఫైనాన్స్ కమిషన్ కింద హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియాలో డ్రైవర్లకు శిక్షణ అవసరం ఉంది. దీనికోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని మంత్రి పొన్నం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరారు.
- బహుళ-లేన్ ఆటోమేటిక్ వెహికల్స్ ఫిట్నెస్ టెస్టింగ్ స్టేషన్ను నిర్మించడానికి అనుమతి ఇవ్వండి.
- హైదరాబాద్ నగరంలో రోడ్ సేఫ్టీ కోసం పబ్లిక్ వాహనాల పర్యవేక్షణ కోసం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలి.
- హైదరాబాద్ ప్రాంతంలో ఎలక్ట్రానిక్ ఎన్ఫోర్స్మెంట్ అమలు కోసం, ఈ-చలాన్ల ఆటో జనరేషన్ ద్వారా జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులను గుర్తించాలి.
- వాహన్,సారథి సాఫ్ట్వేర్లకు బదిలీ చేయడం, డిపార్ట్మెంట్ వాహనం డేటాను ఎన్ఐసీ నిర్వహించే నేషనల్ రిజిస్టర్కి పోర్ట్ చేయాలి.
- ఎంవీఐలు, ఏఎంవీఐలకు సాంకేతికంగా ఫీల్డ్ శిక్షణ ఇవ్వడానికి నిధులు మంజూరు చేయాలి.
- ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల స్థాపనకు భారీ డిమాండ్ ఉన్నందున సహకరించాలని కోరారు.
- తెలంగాణలో అందుబాటులో ఉన్న 21 డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్లను ఆటోమేట్ చేయడానికి కేంద్రం మద్దతు కోరారు.
- పారదర్శకంగా, సాంకేతికతతో నడిచే వేగవంతమైన పరీక్ష కోసం 21 డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేయాలని పొన్నం కోరారు.
- తన నియోజకవర్గమైన హుస్నాబాద్ లో పలు సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లు గా విస్తరించేందుకు నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.ఈ సమావేశంలో మంత్రితో పాటు ఎంపీలు మల్లు రవి,బలరాం నాయక్,రఘురామ్ రెడ్డి,గడ్డం వంశీ కృష్ణ, సురేష్ షెట్కార్ పాల్గొన్నారు.
న్యూఢిల్లీ లో తెలంగాణ ఎంపీలతో కలిసి
— Ponnam Prabhakar (@Ponnam_INC) November 27, 2024
కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది
తెలంగాణ లో జాతీయ రహదారులు మరియు రైల్వే అండర్ రోడ్ బ్రిడ్జి పెండింగ్ పనులు తదితర అంశాలపై నితిన్ గడ్కారీ తో చర్చించడం జరిగింది @nitin_gadkari… pic.twitter.com/fMK0uH3KoB
ప్రియాంకగాంధీని కలిసిన పొన్నం
ఢిల్లీ లో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీని మర్యాద పూర్వకంగా కలిసి వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ప్రియాంక గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ లో జరుగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే గురుంచి ప్రియాంక అడిగి తెలుసుకున్నారని మంత్రి పొన్నం వివరించారు.
Next Story