నిజమేనా : కేటీఆర్ అరెస్టు రేవంత్ కే ఇష్టంలేదా ?
x
Revanth ktr and Dharmapuri Arivnd

నిజమేనా : కేటీఆర్ అరెస్టు రేవంత్ కే ఇష్టంలేదా ?

రేవంత్ ప్రతిజ్ఞలు, కేటీఆర్ సవాళ్ళు, ప్రకటనలు చూసిన జనాలేమో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అరెస్టు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు.


నిజంగానే ఇది ఇంట్రెస్టింగ్ పాయింటనే చెప్పాలి. కేసీఆర్, కేటీఆర్ మీద కేసులు పెట్టి జైలు ఊచలు లెక్కబెడతానని ఒకవైపు రేవంత్ రెడ్డి పదేపదే బహిరంగంగా ప్రతిజ్ఞలు చేస్తున్నాడు. మరోవైపు ఎన్నికేసులు పెట్టుకుంటావో పెట్టుకో, ఏమి పీక్కుంటావో పీక్కో అని కేటీఆర్(KTR) సవాలు చేస్తున్నాడు. బీఆర్ఎస్(BRS) ఆఫీసులో లీడర్లతో కేటీఆర్ మాట్లాడుతు ఏదో కేసులో తనను అరెస్టుచేయాలని రేవంత్(Revanth) తెగ ప్రయత్నిస్తున్నట్లు చెప్పాడు. తనను అరెస్టు చేయగానే రాష్ట్రమంతా లీడర్లు, క్యాడరంతా రోడ్లపైకి రావాలని, ఉద్యమాలు చేయాలని పిలుపిచ్చాడు. ఆ బాధ్యతను కొందరు లీడర్లకు అప్పగించాడు కూడా. రేవంత్ ప్రతిజ్ఞలు, కేటీఆర్ సవాళ్ళు, ప్రకటనలు చూసిన జనాలేమో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అరెస్టు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అదేమో ఎండమావిలాగ తయారైంది.

ఈ నేపధ్యంలోనే బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్(Nizmabad BJP MP Dharmapuri Arvind) ఒక ఆరోపణ చేశాడు. అదేమిటంటే కేటీఆర్ ను అరెస్టుచేయటం రేవంత్ కే ఇష్టంలేదన్నట్లుగా చెప్పాడు. ఎలాగంటే కేటీఆర్ మీద కేసు నమోదుచేసి అరెస్టు చేసేందుకు ప్రభుత్వం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnudev Varma)ను అనుమతి కోరుతు ఫైలు పంపిందని చదువుకున్నాము. రేవంత్ కూడా ఇదే విషయాన్ని మాట్లాడుతు గవర్నర్ దగ్గర నుండి అనుమతి రాగానే వెంటనే కేటీఆర్ మీద కేసు నమోదుచేసి అరెస్టు చేస్తామని ప్రకటించాడు. అదే విషయమై అర్వింద్ మాట్లాడుతు కేటీఆర్ మీద కేసు నమోదుచేయటానికి గవర్నర్ అనుమతి ఎందుకని అడిగారు. కేటీఆర్ ముఖ్యమంత్రి కాదు కనీసం మంత్రి కూడా కాదు కదా అడిగాడు. ఒక సాధారణ ఎంఎల్ఏ అయిన కేటీఆర్ మీద కేసు నమోదు చేసి అరెస్టుచేయటానికి గవర్నర్ అనుమతి అవసరమే లేదని తేల్చేశాడు. కేటీఆర్ మీద కేసునమోదు చేసి అరెస్టు చేయటానికి గవర్నర్ అనుమతి కోరుతు ప్రభుత్వం ఫైలు పంపటం పెద్ద జోకన్నాడు.

ఈ ఫార్ములా రేసు ఏర్పాట్లలో రు 55 కోట్ల అవినీతి జరిగిందన్నది వాస్తవం. నిబంధనలకు విరుద్ధంగా కోట్లాదిరూపాయలు ఏదో కంపెనీకి చెల్లించిందీ వాస్తవమే. రాతమూలకంగా ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతి, ఆదేశాలు లేకుండానే కోట్ల రూపాయలు చెల్లించినట్లు అప్పటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపుల్ కార్యదర్శి అర్వింద్ కుమార్ అంగీకరించాడు. డబ్బులు చెల్లించాలని తానే అర్వింద్ కు ఆదేశాలిచ్చినట్లు కేటీఆర్ స్వయంగా మీడియా సమావేశంలో అంగీకరించాడు. జరిగిన అవినీతిలో తనదే కీలకపాత్రగా కేటీఆర్ స్వయంగా అంగీకరించిన తర్వాత కేసు పెట్టి అరెస్టు చేయటానికి ఇంకా గవర్నర్ ఆమోదం ఎందుకని అర్విండ్ ప్రశ్నించాడు. పనిలోపనిగా లగచర్ల(Lagacharla)లో కలెక్టర్ మీద జరిగిన దాడి కూడా కల్వకుంట్ల కుటుంబం చేయించిన పనే అని ఎంపీ తేల్చేశాడు. కేటీఆర్ ది మేకపోతు గాంభీర్యమని కాబట్టి అర్జంటుగా అరెస్టుచేసి జైలులోకి తోయాలని అర్విండ్ డిమాండ్ చేశారు. అర్వింద్ చెప్పిన మాటలు విన్నతర్వాత కేటీఆర్ మీద కేసుకు రేవంత్ ప్రభుత్వం అనుమతి కోరుతు లేఖ ఎందుకు రాసినట్లు అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎంపీ చెప్పినట్లుగా అనుమతి పేరుతో కేటీఆర్ మీద కేసు నమోదుకాకుండా అరెస్టు జరగకుండా రేవంతే కాలయాపన చేస్తున్నాడా ? అన్న అనుమానాలూ పెరిగిపోతున్నాయి.

Read More
Next Story