బిగ్ బ్రేకింగ్ : జన్వాడ ఫాం హౌస్ లోకి ఇరిగేషన్ అధికారులు
x

బిగ్ బ్రేకింగ్ : జన్వాడ ఫాం హౌస్ లోకి ఇరిగేషన్ అధికారులు

అందరు ఊహించినట్లుగానే హైడ్రా బుల్డోజర్లు జన్వాడ ఫాంహౌస్ లోకి వెళ్ళబోతున్నాయా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది.


అందరు ఊహించినట్లుగానే హైడ్రా బుల్డోజర్లు జన్వాడ ఫాంహౌస్ లోకి వెళ్ళబోతున్నాయా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. మంగళవారం సాయంత్రం ఇరిగేషన్ అధికారులు జన్వాడ ఫాంహౌస్ లోకి ఎంటరయ్యారు. ఫాంహౌస్ కొలతలను తీసుకుంటున్నారు. ఏ నిముషంలో అయినా కూల్చివేతలు మొదలు కావచ్చని సమాచారం. ఉస్మాన్ సాగర్ లేక్ పరిధిలోని ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్ పరిమితులను ఉల్లంఘించి ఫాంహౌస్ ను నిర్మించుకున్నారని చాలాకాలంగా కేటీఆర్ పై ఆరోపణలున్నాయి. అయితే 2014 నుండి 2023వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నకారణంగా అందులోకి వెళ్ళటానికి ఎవరికీ అనుమతి దక్కలేదు.

అధికారంలో కాంగ్రెస్ రావటం, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న ఏడు నెలల తర్వాత సడెన్ గా హైడ్రా అనే సంస్ధను ఏర్పాటుచేశారు. హైడ్రా ఏమి చేస్తుందంటే చెరువులు, కుంటలు, కాల్వలతో పాటు ప్రభుత్వ స్ధలాలను ఆక్రమించి చేసిన నిర్మాణాలను కూల్చేస్తుంది. చెరువులు, కాల్వలు, కుంటల్లోని ఆక్రమణలను తొలగించటంతో పాటు సదరు ప్రాంతం మొత్తాన్ని తిరిగి ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొస్తుంది. హైడ్రా ఏర్పాడిన నెలలోనే సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడైతే అక్రమనిర్మాణాలను హైడ్రా కూల్చటం మొదలుపెట్టిందో వెంటనే జన్వాడ ఫాంహౌస్ జోలికి రాకుండా బిల్డర్ ప్రదీప్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. దాంతో ఒక్కసారిగా అందరి దృష్టి జన్వాడ ఫాం హౌస్ మీదకు మళ్ళింది.




ఎందుకంటే అప్పటివరకు ఫాంహౌస్ కేటీఆర్ దే అని అనుకుంటున్నారు. అలాంటిది సడెన్ గా ప్రదీప్ రెడ్డి కేసు వేయటంతో అందరిలోను అయోమయం మొదలైంది. దీనికి తగ్గట్లుగానే కేటీఆర్ స్పందిస్తు ఫాంహౌస్ తనది కాదని తన మిత్రుడి దగ్గర నుండి లీజుకు తీసుకున్నట్లు వివరించారు. ఫాంహౌస్ తనది కానపుడు మరి గతంలో రేవంత్ రెడ్డి తదితరులమీద కేటీఆర్ ఎందుకు ఫిర్యాదుచేసి అరెస్టు చేయించారన్న బీజేపీ ఎంపీ రఘునందనరావు ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. ఇదే సమయంలో బుల్కాపూర్ నాలాను ఆక్రమించి కట్టుకున్న ఫాంహౌస్ అని తెలిసీ కేటీఆర్ పదేళ్ళుగా అందులో ఎలాగ ఉంటున్నారంటు మంత్రులు దాడులు మొదలుపెట్టారు. దాంతో ఫాం హౌస్ వ్యవహారమంతా గందరగోళంగా తయారైంది.

ఈ నేపధ్యంలోనే ప్రదీప్ కోర్టులో కేసు వేసినా ఊరటలభించలేదు. ఎందుకంటే ఫాంహౌస్ కు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించకుండా చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో సినీనటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా కూల్చేయటంతో అందరి దృష్టి ఫాంహౌస్ నుండి కన్వెన్షన్ సెంటర్ వైపు మళ్ళింది. గడచిన నాలుగురోజులుగా తెలంగాణాలో మొత్తం చర్చంతా కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతమీదే జరుగుతోంది. ఈ సమయంలోనే సడెన్ గా ఇరిగేషన్ అధికారులు జన్వాడ ఫాంహౌస్ లోకి ఎంటరయ్యారు. దాంతో కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. చెల్లెలు కవితకు బెయిల్ వచ్చిందన్న ఆనందం కూడా కేటీఆర్ లో లేకుండా పోయింది. మరి కొలతలు తీసుకుంటున్న ఇరిగేషన్ అధికారులు ఫైనల్ గా ఏమి తేలుస్తారో చూడాల్సిందే.

Read More
Next Story