రంగరాజన్‌పై దాడి భూ సమస్యే కానీ.. మత సమస్య కాదా!
x

రంగరాజన్‌పై దాడి భూ సమస్యే కానీ.. మత సమస్య కాదా!

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి కీలక మలుపులు తిరుగుతోంది.


చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి కీలక మలుపులు తిరుగుతోంది. ఒక ఆలయ పూజారిపై దాదాపు 20 మంది వెళ్లి దాడి చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఏం ఆశించి వారు ఈ దాడికి పాల్పడ్డారు? ఇలా మరెన్నో అనుమనాలు రేకెత్తుతున్నాయి. ఈ దాడిలో రంగరాజన్‌ కంటికి దెబ్బ తగిలిందని, ఈ దురాఘతానికి భయపడిపోయి ఆయన ఎవరికీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయారని, కానీ ఆ తర్వాత తన తండ్రి చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ ఛైర్మన్ సౌందరరాజన్‌తో కలిసి మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ అంశంపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. కొందరు ఇది పూర్తిగా మత సమస్యే అని వాదిస్తున్నారు. మరి కొందరు మాత్రం వేరే సమస్య, అంశాల వల్లే ఈ దాడి జరిగిందని, రంగరాజన్‌పై జరిగింది మాటల దాడే తప్ప.. భౌతిక దాడి కాదన్న వార్త కూడా వినిపిస్తోంది.

ఇది మత సమస్య కాదు..

ఇక్ష్వాకు వంశం వారుసులుగా ప్రకటించుకుని, అటువంటి మైండ్‌సెట్ కలిగిన వ్యక్తులను వెంటవేసుకుని తిరుగుతున్న వ్యక్తి వీర రాఘవరెడ్డి. రామరాజ్యం ఏర్పాటు పేరిట ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన సహచరులతో కలిసి గత శుక్రవారం.. రంగరాజన్‌ను ఇంటికి వెళ్లి కలిసి మాట్లాడారు. తాము అనుకుంటున్న రామరాజ్య స్థాపనకు సహకరించాలని ఆయన కోరడం, అందుకు రంగరాజన్ నిరాకరించడంతో వారు దాడికి పాల్పడ్డారని ప్రచారం జరుగుతోంది. కాగా తాజాగా ఈ అంశం మరో కీలక మలుపు తిరిగింది. అసలు వీరిది ఒక మత సమస్య కాదని, కొందరు కావాలనే దీనిని మత సమస్యగా చిత్రీకరిస్తున్నారని కొందరు చెప్పుకొస్తున్నారు.

రంగరాజన్‌పై దాడి వెనక సుమారు 200 ఎకరాల భూ వివాదం ఉందని వాదన బలంగా వినిపిస్తోంది. ఆ భూమికి సంబంధించే రంగరాజన్‌తో చర్చించడం.. వారి డిమాండ్స్‌కు అర్చకుడు నిరాకరించడంతో దుండగులు దాడికి పాల్పడ్డారన్న వాదన బలంగా వినిపిస్తోంది. కాగా ఈ ప్రచారంపై పోలీసులు కానీ, రంగరాజన్ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. అసలు రంగరాజన్‌పై దాడి విషయంపై బాధ్యుడిగా చెప్తున్న వీరరాఘవరెడ్డి కూడా స్పందించలేదు. దీంతో భూవివాదమే ఈ దాడికి ప్రధాన కారణమన్న అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి ఈ విషయంపై త్వరలో ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.

దుండగులను గుర్తించిన పోలీసులు

రంగరాజన్ దాడి కేసులో ఇప్పటికే ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు మరో 17 మంది గుర్తించారు. రంగరాజన్‌పై మొత్తం 22 మంది దాడి చేయగా వారిలో 17 మంది ఆచూకీ కనుగున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో వీరరాఘవరెడ్డిని ప్రధాన నిందితుడికి చేర్చారు. రాఘవరెడ్డి సహా మరో ఐదుగురిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. కాగా కొందరు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు చేరపట్టామని పోలీసులు చెప్పారు.

Read More
Next Story