
రేవంత్‌పై కొండా తిరుగుబాటు..!
క్యాబినెట్ సమాశానికి కొండా సురేఖ డుమ్మా.
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తిరుగుబాటు చేస్తున్నారా? రేవంత్‌ను ఢీ కొట్టడానికి రెడీ అయ్యారా? అన్న ప్రశ్నలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. గురువారం సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన మంత్రివర్గ సమావేశానికి మంత్రి కొండా సురేఖ గైర్హాజరు కావడమే ఇందుకు ప్రధాన కారణం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొండా ఎపిసోడ్ హాట్ టాపిక్‌గా ఉంది. కొండా సురేఖ పదవికే ఎసరు వచ్చింది. ఆమె, ఆమె కూతురు చేసిన వ్యాఖ్యలు వారి కుటుంబాన్ని మరింత ఊబిలోకి నెట్టాయి. దానికి తోడు ఇప్పుడు క్యాబినెట్ సమాశానికి కొండా సురేఖ డుమ్మాకొట్టారు. మొన్న సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనలో కూడా కొండా సురేఖ ఎక్కడా కనిపించలేదు. దీనిని బట్టి చూస్తుంటే రేవంత్‌ను సురేఖ కావాలనే అవాయిడ్ చేరస్తున్నారని అర్థమవుతోంది. తన మాజీ ఓఎస్‌డీ సుమంత్ విషయంలో రేవంత్‌కు కొండా సురేఖకు మధ్య వివాదం చెలరేగిందా? అన్న చర్చ జరుగుతోంది.
పొంగులేటితో వివాదమే అంకురార్పణ చేసిందా..?
మేడారం ఆలయ టెండర్ల విషయంలో కొండా సురేఖకు, సహచర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మధ్య వివాదం రాజుకుంది. ఆ సందర్భంగానే కొండా సురేఖ.. పొంగులేటిపై సీఎం రేవంత్‌కు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా పార్టీ అధిష్ఠానానికి కూడా ఫిర్యాదు చేశారు. అందులో పొంగులేటికి రేవంత్ రెడ్డియే మద్దతు ఇస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. దాంతో రేవంత్‌కు కోపం వచ్చింది. ఆ తర్వాత కొండా సురేఖపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
అందులో భాగంగానే కొండా సురేఖ ఓఎస్‌డీ సుమంత్‌ను పదవి నుంచి తొలగించింది ప్రభుత్వం. సిమెంట్ ఫ్యాక్టరీ యజమానిని బెదిరించిన కేసులో సుమంత్‌ను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులను కొండా సురేఖ, ఆమె కుమార్తె సుశ్మిత పటేల్ అడ్డుకున్నారు. ఆ తర్వాత కొండా సురేఖ తన కారులో సుమంత్‌ను తీసుకుని వరంగల్ వెళ్లిపోయారు. కాగా పోలీసులను అడ్డుకుంటున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరులపై సుశ్మిత రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వారంతా కలిసి దందాలు చేస్తున్నారని అన్నారు. అంతేకాకుండా తన తల్లి కొండా సురేఖకు ఏమయినా అందుకు రెడ్డి నాయకులే బాధ్యులు అని హెచ్చించారు సుశ్మిత.
అంతేకాకుండా మరుసటి రోజు ఉదయం కూడా సుశ్మిత హాట్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్‌పై చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని పునరుద్ఘాటించారు. ఇదే సమయంలో రేవంత్ నిర్వహించిన క్యాబినెట్ సమావేశానికి కొండా సురేఖ రాకపోవడంతో ఇదంతా కూడా కొండా సురేఖ తిరుగుబాటే అని చర్చ జరుగుతోంది. మరి ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో అని ప్రజలు చర్చించుకుంటున్నారు.