Pushpa-2 Mania|పుష్ప-2 మేనియా ఈ రేంజిలో ఉందా ?
x
Pushpa-2 Range

Pushpa-2 Mania|పుష్ప-2 మేనియా ఈ రేంజిలో ఉందా ?

సినిమాలో ఏముందో ? ఏమిలేదో తెలీదు కాని పిల్లా, పెద్దా అని తేడాలేకుండా సినిమా కోసం ఎగబడిపోతున్నారు.


గురువారం రిలీజైన పుష్ప-2 మ్యానియా ఏ రేంజిలో పెరిగిపోతోంది. సినిమాలో ఏముందో ? ఏమిలేదో తెలీదు కాని పిల్లా, పెద్దా అని తేడాలేకుండా సినిమా కోసం ఎగబడిపోతున్నారు. సినిమాను చూడటానికి చివరకు స్కూలుకు వెళ్ళే చిన్నపిల్లలు సెలవులు పెట్టేస్తున్నారు. విషయం ఏమిటంటే పుష్ప-2 సినిమా (Pushpa-2 Movie)చూడటానికి ఒక స్కూలు పిల్లాడు టీచర్ కు ఏకంగా సెలవు కావాలని రాసిన లెటర్ ఇఫుడు వైరల్ అవుతోంది.

మహబూబాబాద్ జిల్లాలోని ఒక స్కూలులో పిల్లాడికి అల్లు అర్జున్(AlluArjun) అంటే పిచ్చి. పుష్ప-2 సినిమాను చూడాలని చాలాకాలంగా వెయిట్ చేస్తున్నాడు. ఎంతకాలంగానో ఊరిస్తున్న తన అభిమాన హీరో సినిమాను మొదటిరోజు మొదటిషోలోనే చూడాలని పిల్లాడు అనుకున్నాడు. అయితే స్కూలున్నపుడు సినిమా చూడటం ఎలాగ ? అందుకనే ఏకంగా స్కూలుకు డుమ్మా కొట్టేశాడు. చెప్పకుండా ఆపేస్తే అసలు చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. పిల్లాడు ఏమి చేశాడంటే స్కూలు టీచర్ కు లెటర్ రాశాడు. ఏమనంటే తన అభిమాన హీరో అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 చూడాలి కాబట్టి తనకు సెలవు కావాలని రాశాడు.

మామూలుగా అయితే ఏదో కారణం చెప్పి పిల్లాడు ఆగిపోవచ్చు. కాని ఆ పిల్లాడు అలా చేయకుండా పుష్ప-2 సినిమా చూడటం కోసం సెలవు అడగటంతో టీచర్ ముందు షాక్ తిన్నాడు. తర్వాత ఆలోచించి పుష్ప-2 సినిమా చూడాలని నిజాయితీగా లీవ్ లెటర్ రాసిన తన స్టూడెంట్ ను అభినందించాడు. అంతటితో ఊరుకోకుండా పిల్లాడు రాసిన లీవ్ లెటర్ ను కాపీతీసి తన వాట్సప్ గ్రూపులో పెట్టాడు. సినిమా హిట్టయ్యిందో లేదో తెలీదుకాని పిల్లాడు రాసిన లీవ్ లెటర్(Leave Letter) మాత్రం సోషల్ మీడియా(Social Media)లో సూపర్ హిట్టయి వైరల్ అవుతోంది.

Read More
Next Story