రేవంత్ రెడ్డిలో అయోమయం పెరిగిపోతోందా ?
x
Revanth Reddy

రేవంత్ రెడ్డిలో అయోమయం పెరిగిపోతోందా ?

రిజర్వేషన్ అంశం తేలితే కాని ఎన్నికలకు(Local body Elections) పోకూడదన్నది మంత్రివర్గంలోని కొందరి వాదన


ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పూర్తి అయోమయంలో ఉన్నట్లు అర్ధమవుతోంది. స్ధానికసంస్ధల ఎన్నికల నిర్వహణ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్నది ఒకపాయింట్ అయితే, బీసీలకు 42శాతం(BC 42% Reservations) రిజర్వేషన్ అమలు చేయటం ఎలాగన్నది మరో పాయింట్. ఈ రెండుపాయింట్లపై చర్చించేందుకు అందుబాటులో ఉన్న మంత్రులతో రేవంత్(Revanth) శనివారం రాత్రి సుదీర్ఘంగా చర్చించారు. రిజర్వేషన్ అంశం తేలితే కాని ఎన్నికలకు(Local body Elections) పోకూడదన్నది మంత్రివర్గంలోని కొందరి వాదన. ఇదేసమయంలో పార్టీపరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుచేసి ఎన్నికలకు వెళ్ళాలని మరికొందరు మంత్రులు చెప్పినట్లు సమాచారం. అసలు రేవంత్ లోనే అయోమయం పెరిగిపోతోంది. దానికితోడు ఇపుడు మంత్రులు కూడా రెండురకాలుగా చెప్పటంతో తనలోని అయోమయం మరింత పెరిగిపోయింది.

రేవంత్ లో అయోమయం పెరిగిపోతోంది అనటానికి చాలా ఉదాహరణలే ఉన్నాయి. అవేమిటంటే బీసీ బిల్లుకు, ఆర్డినెన్సుకు రాష్ట్రపతి లేదా గవర్నర్ నుండి అనుమతి రాకపోతే పార్టీపరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేయబోతున్నట్లు ఒకపుడు రేవంతే స్వయంగా ప్రకటించారు. తర్వాత కొద్దిరోజులకు తన స్టాండ్ మార్చుకుని రాష్ట్రపతి దగ్గర బిల్లులకు ఎన్నిరోజుల్లో నిర్ణయం తెలపాలనే వివాదం సుప్రింకోర్టు విచారణలో ఉంది. సుప్రింకోర్టులో కేసు తేలితే కాని రిజర్వేషన్ల అమలుపై క్లారిటిరాదు. కాబట్టి కేసు తేలేంతవరకు వెయిట్ చేస్తామని రేవంత్ చెప్పాడు. ఇంకో సందర్భంలో రాష్ట్రపతి-సుప్రింకోర్టు మధ్య వివాదం ఇప్పట్లో తేలేట్లుగా లేదుకాబట్టి స్ధానికసంస్ధల ఎన్నికల నిర్వహణకు విధించిన సెప్టెంబర్ 30 గడువును పెంచాలని హైకోర్టును కోరబోతున్నట్లు ప్రకటించాడు.

గడువు పొడగించాలని కోరబోతున్నట్లు చెప్పిన రేవంత్ ఆ దిశగా హైకోర్టును కోరారా అంటే అదీలేదు. గతంలో హైకోర్టు ఆదేశించినట్లు సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించకపోతే కోర్టు థిక్కారానికి పాల్పడినట్లు అవుతుంది. ఒక బహిరంగసభలో మాట్లాడుతు బీసీలకు పార్టీపరంగా 42శాతం రిజర్వేషన్లు అమలుచేయటానికి పార్టీ, ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలుకు జీవో ఇస్తే సరిపోతుందా ? అనే సందేహాన్ని న్యాయనిపుణులు, ఉన్నతాధికారులను అడిగాడు. ఎందుకంటే బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్న నిర్ణయం న్యాయసమీక్షలో నిలబడదు. మొత్తం రిజర్వేషన్లు 50శాతం మించకూడదని గతంలో సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పుంది. కాబట్టి బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలుచేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఎవరైనా కోర్టులో చాలెంజ్ చేయచ్చు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరూ కోర్టులో కేసులు వేయకుండా చూడాల్సిన బాధ్యత బీసీ సంఘాల నేతలపైనే ఉందని రేవంత్ చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. కేసు వేయదలచుకున్న వాళ్ళు బీసీ సంఘాల నేతలకు, ప్రభుత్వానికి ముందుగా చెప్పి కేసు దాఖలుచేస్తారా ?

వీటన్నింటికి క్లైమ్యాక్సుగా అందుబాటులో ఉన్న మంత్రుల అభిప్రాయాలు తీసుకోవటం. నిజానికి పార్టీపరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుచేయటమే ఉత్తమమైన మార్గం. ఈ నిర్ణయాన్ని ఎవరూ, ఎక్కడా ప్రశ్నించేందుకు లేదు. పార్టీపరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుచేస్తే బీజేపీ కూడా అదేపద్దతిలో రిజర్వేషన్లు అమలుచేస్తుందని పార్టీఅధ్యక్షుడు నారపరాజురామచంద్రరావు ఇప్పటికే ప్రకటించారు. పార్టీపరంగా బీసీలకు రిజర్వేషన్లు అమలుచేయటంపై క్లారిటి ఇవ్వాల్సింది బీఆర్ఎస్ మాత్రమే. ఇపుడు పార్టీపరంగా రిజర్వేషన్లు అమలుచేసి తర్వాత కోర్టు తీర్పుప్రకారం అవకాశం ఉంటే ఐదేళ్ళతర్వాత జరగబోయే ఎన్నికల్లో చట్టబద్దంగా 42శాతం రిజర్వేషన్లు అమలుచేయటానికి మార్గం ఏర్పడుతుంది. ఏదేమైనా రేవంత్ అయితే ఇపుడు ఫుల్లు అయోమయంలో ఉన్నట్లు అర్ధమైపోతోంది. మరి క్లారిటి ఎప్పుడొస్తోందో చూడాలి.

Read More
Next Story