
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు ఆర్ఎస్ ప్రవీణ్ డుమ్మా?
ధృవీకరించని బిఎస్పి నేత
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఐపిఎస్ అధికారి, బిఆర్ఎస్ నేత ఆర్ ఎస్ ప్రవీణ్ కు నోటీసులిచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరుకావాలని సిట్ నోటీసులు జారి చేసింది. సిట్ విచారణకు హాజరయ్యే విషయమై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించడం లేదు. తాను బిఎస్పి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన ఫోన్ ట్యాపింగ్ అవుతుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపణలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం, డిజిపికి ఫిర్యాదు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తర్వాతికాలంలో బిఆర్ఎస్ లో చేరారు. ప్రస్తుతం బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా తాను మాట్లాడలేనని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిర్ణయించుకున్నారు. నోటీసులపై ఆయన స్పందించడం లేదు. సిట్ విచారణకు ఎగ్గొట్టే అవకాశం ఎక్కువగా ఉంది.
Next Story