BRS and Supreme court|బీఆర్ఎస్ ది మరో వృధా పోరాటమేనా ?
x
KCR and KTR

BRS and Supreme court|బీఆర్ఎస్ ది మరో వృధా పోరాటమేనా ?

బీఆర్ఎస్(BRS) తరపున గెలిచి కాంగ్రెస్(Congress) లోకి ఫిరాయించిన పదిమంది ఎంఎల్ఏలపై అనర్హత వేటువేసేట్లుగా స్పీకర్ ను ఆదేశించాలని సుప్రింకోర్టులో పిటీషన్ వేసింది.


ప్రధానప్రతిపక్షం బీఆర్ఎస్ మరో వృధాపోరాటం మొదలుపెట్టిందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే బీఆర్ఎస్(BRS) తరపున గెలిచి కాంగ్రెస్(Congress) లోకి ఫిరాయించిన పదిమంది ఎంఎల్ఏలపై అనర్హత వేటువేసేట్లుగా స్పీకర్ ను ఆదేశించాలని సుప్రింకోర్టులో పిటీషన్ వేసింది. ఇలాంటి పిటీషన్నే గతంలో వేస్తే హైకోర్టు(Telangana Highcourt) కొట్టేసింది. ఫిరాయింపు ఎంఎల్ఏ(Defection MLAs)ల మీద అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను నిర్దేశించలేదని స్పష్టంగా హైకోర్టు తేల్చిచెప్పింది. కొంతకాలం గ్యాప్ తర్వాత బీఆర్ఎస్ మళ్ళీ అదేవాదనతో ఇపుడు సుప్రింకోర్టు(Supreme Court)లో పిటీషన్ వేయటం గమనార్హం. విచారణ సందర్భంగా బీఆర్ఎస్ వేసిన పిటీషన్ను హైకోర్టు కొట్టేసిన విషయం అందరికీ తెలిసిందే. అయినాసరే ఇదే పిటీషన్ను మరోసారి సుప్రింకోర్టులో ఎందుకు దాఖలుచేసిందో అర్ధంకావటంలేదు.

బీఆర్ఎస్ నేతల వాదన ఎంతవిచిత్రంగా ఉందంటే కరీంనగర్ జిల్లా సమీక్షలో ఫిరాయింపు ఎంఎల్ఏ బండిసంజయ్ మాట్లాడుతు తాను కాంగ్రెస్ పార్టీ అని చెప్పాడు కాబట్టి వెంటనే అనర్హత వేటువేయాలని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ తరపున గెలిచిన సంజయ్ తర్వాత కాంగ్రెస్ లోకి ఫిరాయించటాన్ని సమర్ధించుకుంటున్నాడు. నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పుకుంటున్నాడు. గతంలో కాంగ్రెస్, టీడీపీ తరపున గెలిచి బీఆర్ఎస్ లోకి ఫిరాయించిన 18 మంది ఎంఎల్ఏలు కూడా ఇదేచెప్పారు. ఇతరపార్టీల్లో గెలిచిన ఎంఎల్ఏలను బీఆర్ఎస్ లోకి కేసీఆర్(KCR) లాక్కున్నపుడు ప్రజాస్వామ్యం, విలువలు, నైతికత ఏవికూడా కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao), కవిత(Kavitha) తదితరులకు గుర్తురాలేదు. బంగారుతెలంగాణ కోసమే ఇతర పార్టీల నుండి ఎంఎల్ఏలు తమపార్టీలో చేరుతున్నట్లు వీళ్ళు సమర్ధించుకున్నారు.

అప్పట్లో ఫిరాయింపులు కరెక్టే అయితే ఇపుడు కూడా కరెక్టే కదా. ఇప్పుడు తప్పయితే అప్పుడూ తప్పే. అప్పట్లో ఫిరాయించిన ఎంఎల్ఏల్లో తలసాని శ్రీనివాసయాదవ్ లాంటి వాళ్ళకు కేసీఆర్ మంత్రిపదవులు కూడా ఇచ్చారు. అప్పట్లో ఫిరాయింపులను కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకోవటంలో తప్పులేనిది ఇపుడు సంజయ్ తాను కాంగ్రెస్ అని చెప్పుకోవటం తప్పుగా కనిపించటమే ఆశ్చర్యంగా ఉంది. నెలరోజుల్లో ఫిరాయింపులపై అనర్హత వేటువేయాలని స్పీకర్ ను ఆదేశించాలన్న బీఆర్ఎస్ డిమాండును అప్పట్లో హైకోర్టు కొట్టేసింది. అనర్హత వేటువేయాలనే డిమాండ్ విషయంలో కోర్టు స్పీకర్ ను ఆదేశించలేందని చెప్పింది. కాకపోతే వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకోమని చెప్పిందంతే. హైకోర్టు ఆదేశాలను స్పీకర్ తుంగలో తొక్కుతున్నరనే ఆరోపణతో తాజాగా కారుపార్టీ నేతలు సుప్రింకోర్టులో పిటీషన్ వేశారు.

ఫిరాయింపులపై అనర్హత వేటువేసే విషయంలో సుప్రింకోర్టు కూడా హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా నడుచుకుంటుందా ? అనేఅనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఏన్యాయస్ధానంకూడా శాసనవ్యవస్ధలోకి జొరబడేందుకు ఇష్టపడదు. ఒకవేళ ఫిరాయింపులపై స్పీకర్ తీసుకున్న నిర్ణయం సరైనది కాదని అనిపిస్తే అప్పుడు బీఆర్ఎస్ కేసు వేస్తే సుప్రింకోర్టు విచారించే అవకాశముంది. కానిఇపుడు స్పీకర్ అసలు ఫిరాయింపులపై విచారణే జరపలేదు. ఇక నిర్ణయం తీసుకునే అవకాశం ఎక్కడ ? బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ప్రోత్సహించిన ఫిరాయింపులపై టీడీపీ, కాంగ్రెస్ ఎంత పోరాటంచేసినా ఉపయోగంలేకపోయింది. ఇపుడుకూడా దాదాపు అదేసీన్ రిపీటవుతుందనటంలో సందేహంలేదు. అందుకనే బీఆర్ఎస్ ది మరో వృధా పోరాటం అని అంటున్నది. చూద్దాం సుప్రింకోర్టు ఎలా రియాక్టవుతుందో.

Read More
Next Story