Manchu Family|‘మంచు’ కుటుంబంలో మంటలు ?
మంచు మోహన్ బాబు(Manchu MohanBabu), చిన్నకొడుకు మంచు మనోజ్(Manchu Manoj) మధ్య పెరిగిపోయి పహడీ షరీఫ్ పోలీసుస్టేషన్ కు కూడా ఎక్కినట్లు సమాచారం.
మంచు ఫ్యామిలిలో మంటలు పెరిగిపోతున్నాయి. ఇంతకాలం అన్నదమ్ములు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య మాత్రమే ఉన్న విభేదాలు తాజాగా తండ్రి మంచు మోహన్ బాబు(Manchu MohanBabu), చిన్నకొడుకు మంచు మనోజ్(Manchu Manoj) మధ్య పెరిగిపోయి పహడీ షరీఫ్ పోలీసుస్టేషన్ కు కూడా ఎక్కినట్లు సమాచారం. విషయం ఏమిటంటే తన తండ్రి మోహన్ బాబు తనతో పాటు తన భార్య మౌనికమీద దాడిచేసి గాయపరిచాడని మనోజ్ పహడీషరీఫ్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదుచేశాడని సమాచారం. కొడుకు తనపై ఫిర్యాదు చేశాడని తెలిసిన వెంటనే మోహన్ బాబు కూడా మనోజ్ మీద పోలీసుస్టేషన్ కు వచ్చి ఎదురు ఫిర్యాదు చేశారు. దాంతో ఇంట్లో విభేదాలు రోడ్డునపడి చివరకు పోలీసుస్టేషన్లో ఒకరిమీద మరొకరు ఫిర్యాదు చేసుకునేంత దాకా వచ్చాయి. మోహన్ బాబు అనుచరుడు, మోహన్ బాబు యూనివర్సిటీ(MohanBabu University)లో పనిచేస్తున్న వినయ్ అనే వ్యక్తి మనోజ్ పై దాడిచేసినట్లు సమాచారం.
ఆస్తులు, ఆధిపత్యం దగ్గర ఎంతటి సన్నిహితులైనా సరే చివరకు రక్తసంబంధీకుల మధ్య కూడా విభేదాలు తప్పవని ఇప్పటికే చాలాసార్లు రుజువయ్యాయి. ఈకోవలోకే తాజాగా మంచు కుటుంబం చేరిందంతే. మంచు కుటుంబానికి చెందిన ఆస్తులు, ఆస్తులు, విద్యాసంస్ధలపై ఆధిపత్యం విషయంలోనే కుటుంబంలో గొడవలు పెరిగిపోయి చివరకు తండ్రి, కొడుకులు ఒకరిపై మరొకరు దాడులుచేసుకుని పోలీసుస్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్నదమ్ముడు మంచు విష్ణు(Manchu Vishnu), మంచు మనోజ్ మధ్య చాలాకాలంగా గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇద్దరి మధ్య గొడవలు పెరిగిపోవటంతో సోదరుల మధ్య విభేదాలు కొంతకాలం క్రితం రోడ్డునపడ్డాయి. తర్వాత ఇద్దరికీ కావాల్సిన వారు సర్దుబాబు చేయటంతో గొడవలకు బ్రేక్ పడ్డాయి.
అన్నదమ్ముల మధ్య గొడవలకు బ్రేక్ పడిందని అనుకుంటున్న నేపధ్యంలోనే సడెన్ గా తండ్రి, కొడుకుల మధ్య విభేదాలు పెరిగిపోవటం, చివరకు ఒకరిపై మరొకరు దాడులు చేసుకునేంత దాకా పరిస్ధితి దిగజారింది. గడచిన వారం రోజులుగా మోహన్ బాబు, మనోజ్ మధ్య బాగా గొడవలు అవుతున్నాయి. ఆ గొడవలు కాస్త చివరకు ఒకరిమీద మరొకరు దాడులు చేసుకునేంత వరకు వచ్చిందని తెలుస్తోంది. ఇంట్లో గొడవలు జరుగుతున్నట్లు మనోజ్ ఇంటినుండి శనివారం రాత్రి డయల్ 100కు ఫోన్ వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ప్రముఖ సెలబ్రిటీల కటుంబంలో గొడవలు కాబట్టి అధికారికంగా ధృవీకరించటానికి పోలీసులు అంగీకరించటంలేదు.
తండ్రి, కొడుకుల మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఇద్దరు పరస్పరం దాడులు చేసుకున్నారని మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మోహన్ బాబు దాడిచేసి గాయపరిచాడని మనోజ్ ఫిర్యాదు చేయగానే అలాంటి ఫిర్యాదునే కొడుకు మనోజ్ పైన మోహన్ బాబు కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇంతకీ ఎవరు ఎవరిమీద దాడిచేశారు అన్నది పెద్ద చిక్కుప్రశ్నగా మారింది. మొదటి ఎవరు ఎవరిపైన దాడి చేశారు, తర్వాత దాడిచేసింది ఎవరనే విషయంలో సస్పెన్సు పెరిగిపోతోంది. తండ్రి,కొడుకుల మధ్యలోకి మోహన్ బాబు యూనివర్సిటిలో ఉద్యోగి వినయ్ ఎలా పిక్చర్లోకి ఎంటరయ్యారు అన్న ప్రశ్నకు సమాధానం లేదు. సెలబ్రిటీ ఇంట్లో గొడవలు కాబట్టి ఎవరూ అధికారికంగా నోరిప్పేందుకు ఇష్టపడటంలేదు. చివరకు ఏమవుతుందో చూడాలి.