కొండా సురేఖది దండుపాళ్యం బ్యాచా ?
x
Minister Konda Surekha

కొండా సురేఖది దండుపాళ్యం బ్యాచా ?

దొంగల ముఠాకన్నా అధ్వాన్నమా ? అవుననే అంటున్నారు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి. మంత్రి చరిత్రను తవ్వితే చాలా విషయాలు బయటపడతాయన్నారు. సు


మంత్రి కొండాసురేఖది దండుపాళ్యం బ్చాచా ? దొంగల ముఠాకన్నా అధ్వాన్నమా ? అవుననే అంటున్నారు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి. మంత్రి చరిత్రను తవ్వితే చాలా విషయాలు బయటపడతాయన్నారు. సురేఖ చరిత్ర జిల్లాలోని ప్రజలందరికీ తెలుసని రెడ్డి అన్నారు. అలాంటి కొండా కూడా ఇతరుల గురించి మాట్లాడటం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా అవుతుందని ఎద్దేవా చేశారు. కొండ సురేఖకు అధికారం తలకెక్కి ఎవరూ కనబడటంలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళ అయ్యుండి మరో సినీనటి గురించి ఇంత అసహ్యంగా ఎలా మాట్లాడారని రాకేష్ మంత్రిని నిలదీశారు. సెలబ్రిటీ కపుల్ సమంత-నాగచైతన్య విడాకుల విషయంపై కొండా చేసిన ఆరోపణలు, వాళ్ళు విడాకులు తీసుకోవటానికి కేటీఆర్ ఏ విధంగా కారణమయ్యారో మంత్రి మీడియా సమక్షంలో చేసిన వ్యాఖ్యలు సంచలనమైన విషయం తెలిసిందే.

ఆ వ్యాఖ్యలనే రాకేష్ రెడ్డి గుర్తుచేస్తు మంత్రిపై మండిపడ్డారు. కొండా సురేఖ తనది వరంగల్ అని చెప్పుకోవటం ఆపేయాలని రాకేష్ సూచించారు. వరంగల్ జిల్లా అంటే సంస్కృతి, సంస్కారం, మర్యాదగా చెప్పారు. ఇవేవీ లేని కొండా తనది వరంగల్ అని చెప్పుకోవటం వల్ల జిల్లా పరువుపోతోందని ఎద్దేవా చేశారు. సాటి మహిళపైన నీచమైన వ్యాఖ్యలు చేసిన కారణంగా తనది వరంగల్ అని చెప్పుకునే హక్కును సురేఖ కోల్పోయినట్లు రాకేష్ అభిప్రాయపడ్డారు. రాణిరుద్రమ బిడ్డలమని మంత్రి చెప్పుకుని తిరగటం సిగ్గుచేటన్నారు. రాణిరుద్రమదేవి రాజ్యంకోసం పోరాడిందని, మరి సురేఖ ఎవడి కోసం పోరాడుతోందని ప్రశ్నించారు. డైవర్షన్ పాలిటిక్స్ కోసం రేవంత్ రెడ్డే వెనకుండి సురేఖను నడిపిస్తున్నట్లు రెడ్డి ఆరోపించారు.

మొదటేమో తాను మహిళని అనికూడా చూడకుండా ఇలా చేస్తారా అని ఏడ్చిన మంత్రి తాను మాత్రం మరో మహిళగురించి నీచంగా మీడియా ముందు మాట్లాడవచ్చా అని ప్రశ్నించారు. మహిళ అన్న వాదన చెల్లకపోయేసరికి బీసీ కార్డును ఉపయోగించినట్లు ఆరోపించారు. బీసీ మహిళ అయితే ఎవరిమీదైనా నోటికొచ్చినట్లు మాట్లాడవచ్చా అని రాకేష్ లాజిక్ లేవదీశారు. బీసీ, ఎస్సీ, ఓసీ, ఎస్టీ అయినా ముందుగా తామంతా మనుషులమని, నాగరీకంగా, సభ్యతగా మాట్లాడాలన్న విషయాన్ని అందరు గుర్తుంచుకోవాలని రాకేష్ అన్నారు. ఆలస్యమైనా పేరు ఎత్తకుండానే రాకేష్ తమపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలు, వ్యాఖ్యలపై స్పందించారు.

Read More
Next Story